RBI | అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ ప్రభావం..! బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.48వేల కోట్లు..!
RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇటీవల ఏర్పడిన నగదు కొరతను తీర్చేందుకు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏడురోజుల గడువుతో నిర్వహించిన వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం ద్వారా రూ.48,014 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇటీవల ఏర్పడిన నగదు కొరతను తీర్చేందుకు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏడురోజుల గడువుతో నిర్వహించిన వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం ద్వారా రూ.48,014 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇటీవల భారీగా జరిగిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల కారణంగా బ్యాంకుల్లో ఉన్న అదనపు నిధులు ఒక్కసారిగా తగ్గిపోవడంతో చర్యలు తీసుకుంది. ఈ నిధులు 5.26శాతం కట్ ఆఫ్ వడ్డీతో బ్యాంకులకు అందించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
రూ.1.50లక్షల కోట్ల పరిమితి..
ఈ వేలానికి ఆర్బీఐ ముందుగా రూ.1.50 లక్షల కోట్ల పరిమితిని నిర్ణయించింది. అయితే, లిక్విడిటీ ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాంకులు తీసుకున్న మొత్తం మాత్రం రూ.48,014 కోట్లకే పరిమితమైంది. ఇది బ్యాంకుల తక్షణ అవసరాలు అంచనాలకు తగ్గట్టుగా లేకపోవచ్చని సూచిస్తోంది. గత రెండు రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితి గణనీయంగా మారింది. మార్చి 15 నాటికి సుమారు రూ.2.08 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీ ఉండగా.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల తర్వాత మార్చి 16 నాటికి అది రూ.75,483.63 కోట్లకు పడిపోయింది. ఈ భారీ తగ్గుదలతో తాత్కాలికంగా నిధుల కొరత ఏర్పడింది. వేరియబుల్ రేట్ రెపో (VRR) విధానంలో ఆర్బీఐ తక్కువ కాలానికి బ్యాంకులకు నిధులను వేలం వేస్తుంది. ఇందులో బ్యాంకులు తమ అవసరాల మేరకు బిడ్ చేసి నిధులు పొందుతాయి. ఈ విధానం ద్వారా బ్యాంకులు తక్షణ లిక్విడిటీ అవసరాలను సులభంగా తీర్చవచ్చని పేర్కొంది.
ముందు రోజుల్లో మరింత ఒత్తిడి?
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లో లిక్విడిటీ పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారాంతంలో చెల్లించాల్సిన జీఎస్టీ కారణంగా బ్యాంకుల నుంచి మరిన్ని నిధులు బయటకు వెళ్లే అవకాశం ఉండడంతో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్‌నైట్ వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచేందుకు గత కొన్ని నెలలుగా ఆర్బీఐ వరుసగా లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెడుతోంది. ఈ చర్యల ఫలితంగా ఓవర్‌నైట్ రేట్లు రెపో రేటు కంటే తక్కువ స్థాయిలో కొనసాగుతున్నాయి. బ్యాంకులు ఒక రోజు గడువుకు పరస్పరం అప్పు తీసుకునే వడ్డీ రేట్లను ఓవర్‌నైట్ రేట్స్‌గా పిలుస్తారు. భారత్‌లో దీన్ని వెయిటెడ్ అవరేజ్ కాల్ రేట్ (WACR)గా పిలుస్తారు. ఇది మానిటరీ పాలసీ అమలులో కీలక సూచికగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా 2026 జనవరి నుంచి ఇప్పటివరకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు (OMO) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు చేసి ఆర్బీఐ సుమారు రూ.3.50 లక్షల కోట్ల స్థిర లిక్విడిటీని బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టినట్లు సమాచారం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్మెంట్

CS Jaju | ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు





