హోమ్ లోన్, కార్ లోన్లను కట్టేవారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గాయి.. కానీ..?
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ భారీగా పతనమై చారిత్రాత్మక కనిష్టానికి చేరుకున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన సారథ్యంలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు ఆర్‌బీఐ మానెటరీ పాలసీ కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 5.50 గా ఉన్న రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 5.25 కు చేరుకుంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్‌బీఐ మొత్తంగా 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం గమనార్హం.
కన్‌జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) గణాంకాల ప్రకారం రిటెయిల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 0.25 శాతం తగ్గినట్లు తేలింది. కానీ ఆర్‌బీఐ పెట్టుకున్న 2 నుంచి 6 శాతం తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అలాగే మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ రోజు రోజుకీ గణనీయంగా పడిపోతోంది. ఇప్పటికే చారిత్రాత్మక కనిష్ట విలువకు రూపాయి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్థిక వృద్ధిని సాధించేందుకు, ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించి వారి కొనుగోలు శక్తిని పెంచేందుకు గాను రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెపో రేటు అంటే బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులను అప్పుగా తీసుకునేందుకు ఉపయోగించే వడ్డీ రేటు అన్నమాట. అంటే రెపో రేటు ఎక్కువగా ఉంటే బ్యాంకులు ఆర్‌బీఐ దగ్గర తాము తీసుకున్న అప్పులకు గాను అధిక మొత్తంలో వడ్డీలను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అదే రెపో రేటు తగ్గితే బ్యాంకులు ఆర్‌బీఐ దగ్గర తక్కువ వడ్డీ రేటుకే అప్పులను తీసుకోవచ్చు. దీంతో బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి తక్కువ మొత్తంలో వడ్డీలను వసూలు చేస్తాయి. అయితే రెపో రేటు తగ్గితే దాని ప్రభావం ఫ్లోటింగ్ రేట్ ప్రకారం లోన్లను తీసుకున్న వారిపైనే పడుతుంది. ఫిక్స్‌డ్ రేట్ ప్రకారం లోన్లను తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు. సాధారణంగా ఫ్లోటింగ్ రేట్ ప్రకారం లోన్లను ఎక్కువగా వినియోగదారులు హోమ్ లోన్స్, కార్ లోన్స్ విభాగంలో తీసుకుంటారు. కనుక వారికే రెపో రేటు తగ్గుదల ప్రయోజనం లభిస్తుంది.
అయితే రెపో రేటును తగ్గించినప్పటికీ ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం చాలా కష్టమని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు చేపడుతూ వెనక్కి వెళ్తుండడం, మరోవైపు అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌పై సందిగ్ధత నెలకొనడం, భారత కరెన్సీ విలువ నానాటికీ పడిపోతుండడం వల్ల ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






