Harish Rao | చెప్పేది ఇందిరమ్మ రాజ్యం.. చేసేది హిట్లర్ రాజ్యం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు భూములు ఇస్తుంది.. ఈ సర్కారేమో పేదల నుంచి భూములు లాక్కుంటుందని ధ్వజమెత్తారు. చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం.. చేసేదేమో హిట్లర్ రాజ్యం అని దుయ్యబట్టారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు భూములు ఇస్తుంది.. ఈ సర్కారేమో పేదల నుంచి భూములు లాక్కుంటుందని ధ్వజమెత్తారు. చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం.. చేసేదేమో హిట్లర్ రాజ్యం అని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సర్వే నంబర్ 218లో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు మంగళవారం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి.. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. తెలిసో, తెలియకో పేదోడు కబ్జా చేస్తే పట్టాలు ఇవ్వాలి. కానీ రక్షించే వాడే భక్షకుడు అయ్యాడు. ఖమ్మంలో రెవెన్యూ మంత్రి ఉండి కూడా ఉపయోగం లేదు. రెవెన్యూ మంత్రి అంటే ఇళ్ల స్థలాలు ఇస్తారు, ఇండ్లు కట్టిస్తారు. పేదలకు పట్టాలిస్తారు. జీవో 59 కింద రెగ్యులరైజ్ చేస్తారు. ఖమ్మం జిల్లా దురదృష్టమో ఏమో కానీ, ఇక్కడ రివర్స్ అయ్యింది. మొన్న వెలుగుమట్ల ఇప్పుడేమో రఘునాథపాలెంలో షురూ చేశారు. వెలుగుమట్లలో పేదల జోలికి వస్తే రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభుత్వ పరువు పోయింది. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. సోయి రాలేదు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇల్లు లాక్కునే పరిస్థితి బాధాకరం..
గతంలో సర్వే నెంబర్ 218లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు, స్థలాలు ఇచ్చింది. కరెంటు పోల్స్ , నల్లా కలెక్షన్లు ఏర్పాటు, ప్లాట్లకు నెంబర్లు కూడా కేటాయించింది. చేతనైతే మీరు ఇల్లు కట్టించండి. ఇంటికి సాయం చేయండి. అసంపూర్తిగా ఉంటే పూర్తి చేయాలి. కానీ ఇల్లు లాక్కునే పరిస్థితి బాధాకరం. తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అమాయకుల దగ్గర, పేదల దగ్గర జాగాలు లాక్కోద్దని కలెక్టర్‌కు గట్టిగా చెప్పానని హరీశ్‌రావు తెలిపారు.
అదే చట్టం ప్రకారం ఖమ్మంలో ఇవ్వొచ్చు కదా..?
రాత్రికి రాత్రి జేసీబీలు తెచ్చి ఇండ్లు కూలగొడుతున్నారు. ఇల్లు కట్టే ప్రభుత్వం కాదు ఇది, కూల్చే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో కూలగొడుతున్నాడు, ఇక్కడ పొంగులేటి జేసీబీలు పెట్టి ఇల్లు కూలగొడుతున్నాడు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే అది కూడా ఆక్రమించుకున్నారు. కేసీఆర్ క్యాబినెట్‌లో పెట్టి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తక్షణమే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే జర్నలిస్టులకు మేమే పొజిషన్ ఇప్పిస్తాం.. మేము వాళ్లతో పాటు వెళ్లి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు, అక్కడ ఇబ్బంది లేనప్పుడు.. ఖమ్మంలో కేసీఆర్ ఇచ్చిన జీవో వల్ల ఎక్కడ ఇబ్బంది వస్తుంది. ఏమి అడ్డంకి ఉందో రెవిన్యూ మంత్రి చెప్పాలని ప్రశ్నిస్తున్నా. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇచ్చినప్పుడు అదే చట్టం ప్రకారం ఖమ్మంలో ఇవ్వొచ్చు కదా..? అని హరీశ్‌రావు నిలదీశారు.
రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా..?
అయినా పేదల ఇండ్లు కూల్చడం ఏంటి..? వెలుగుమట్ల తర్వాత కూడా మీ కళ్ళు చల్లబడలేదా. వెలుగుమట్ల పేదల కన్నీళ్లు చూశాక కూడా రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా..? పిచ్చిపిచ్చి ఆలోచనలు విరమించుకోండి. నేషనల్ హైవే పేరుతో కొన్ని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో కొన్ని ప్లాట్లు తీసుకున్నారు. అన్ని పోయినా మిగిలిన ప్లాట్లు కూడా ఎందుకు లాక్కుంటున్నారు. పేదలు స్కూల్ పక్కన, జాతీయ రహదారి పక్కన ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వడం లేదా..? ఈ స్థలం విలువైంది కాబట్టి గరీబోళ్ల దగ్గర లాక్కుంటున్నారా..? వాళ్లకు ఇంత విలువైన స్థలాలు అవసరమా అనుకుంటున్నారా. ఆనాడు కేసీఆర్ ఇచ్చారు. వాళ్ళ అదృష్టం బాగుంది భూముల ధరలు పెరిగాయి. కేసీఆర్ ఇచ్చిన ప్లాట్లకు పేదలను ఓనర్లను చేయండి. అంతేగాని ఆ ప్లాట్లు గుంజుకుంటామంటే ఊరుకోబోము. ఆలోచన విరమించుకోవాలి.. లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.
ప్రశ్నించే గొంతుకలను బెదిరించే ప్రయత్నం
ప్రశ్నించే గొంతుకలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నీకు రోజులు దగ్గరపడ్డాయి. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రెండున్నర ఏండ్లు పూర్తయిపోయింది నీ పాలనకు. పేదల ఉసురు పోసుకోకు, పేదలు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. ఆసుపత్రులను, కాలేజీలను బతికించు. నీ పనుల వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేటు దావఖానాలు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా
- ●Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'
- ●Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!
- ●KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్
- ●Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్
- ●Hyderabad Metro Rail | కథ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి

Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా

Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'

Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!

KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్




