త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | గ‌ణాంకాల త‌గ్గుద‌ల ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీ న‌ష్టాల్లో ముగిశాయి. ఉద‌యం ప్రారంభ సెష‌న్‌లో నష్టాల‌తో మొద‌లైనా కాసేప‌టి సూచీలు కోలుకుని ఇంట్రా డే గ‌రిష్టాల‌ను తాకాయి. కానీ అన్ని రంగాల్లోనూ విప‌రీత‌మైన అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొన‌డంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలాయి. దీంతో ఇంట్రా డే క‌నిష్టాల‌ను దాటి దిగువ‌న స్థిర‌ప‌డ్డాయి.

S

Business | Published On Jun 23, 2026, 4.05 pm IST

Stock Markets | గ‌ణాంకాల త‌గ్గుద‌ల ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీ న‌ష్టాల్లో ముగిశాయి. ఉద‌యం ప్రారంభ సెష‌న్‌లో నష్టాల‌తో మొద‌లైనా కాసేప‌టి సూచీలు కోలుకుని ఇంట్రా డే గ‌రిష్టాల‌ను తాకాయి. కానీ అన్ని రంగాల్లోనూ విప‌రీత‌మైన అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొన‌డంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలాయి. దీంతో ఇంట్రా డే క‌నిష్టాల‌ను దాటి దిగువ‌న స్థిర‌ప‌డ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 893 పాయింట్లు (1.16 శాతం) ప‌త‌న‌మై 76,200.68 వ‌ద్ద ముగియ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 279 పాయింట్లు (1.16 శాతం) న‌ష్ట‌పోయి 23,824.10 వద్ద స్థిర‌ప‌డింది. అన్ని రంగాల్లోనూ పెట్టుబ‌డిదారులు లాభాల బుకింగ్‌కు ఆశించ‌డంతో అమ్మ‌కాల ఒత్తిడి ఏర్ప‌డి సూచీలు కుప్ప‌కూలాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీలు ఒక్కొక్క‌టి 1 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. మిడ్‌, స్మాల్ క్యాప్ విభాగాల్లోనూ అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1.05 శాతం ప‌త‌న‌మ‌వ్వ‌గా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 0.48 శాతం త‌గ్గింది.

సేవలు, త‌యారీ రంగ వృద్ధి త‌గ్గుద‌ల‌..

తీవ్ర‌మైన అమ్మ‌కాల ఒత్తిడి కార‌ణంగా బీఎస్ఈలో న‌మోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ గ‌త సెష‌న్‌లోని రూ.480.6 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.475 ల‌క్ష‌ల కోట్ల క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోయింది. దీంతో పెట్టుబ‌డిదారులు ఒక్క‌రోజులోనే దాదాపుగా రూ.6 ల‌క్ష‌ల కోట్ల సంప‌దను న‌ష్ట‌పోయారు. బ‌ల‌హీన‌మైన రుతు ప‌వ‌నాలు, ఆశాజ‌న‌కంగా లేని వ్యాపార గ‌ణాంకాలపై ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ నెటివ్‌గా మారింది. దీంతో వారు లాభాల స్వీక‌ర‌ణ‌కు నిర్ణ‌యించుకున్నారు. ఫ‌లితంగా మార్కెట్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. జూన్‌లో భార‌త సేవా కార్య‌క‌లాపాలు 17 నెల‌ల క‌నిష్ట స్థాయిల‌కు ప‌డిపోగా, త‌యారీ రంగ వృద్ధి 3 నెల‌ల క‌నిష్ట స్థాయికి త‌గ్గింది. అంత‌ర్జాతీయంగా గ‌త 3 నెల‌లుగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న నెల‌కొన‌గా, అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి చ‌ర్చ‌ల దిశ‌గా పురోగ‌తిని క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికీ తాజాగా వెలువ‌డుతున్న గ‌ణాంకాలు పెట్టుబ‌డిదారుల్లో నిరాశ‌ను నింపుతున్నాయి. దీంతో సెంటిమెంట్ నెగెటివ్‌గా మారింది.

ప్ర‌తికూల ఫ‌లితాల‌తో మార్కెట్లు కుదేలు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.14 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 77 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.24 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 73 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడైంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. ఉద‌యం సెష‌న్‌లో కాస్త బ‌లం ప్ర‌ద‌ర్శించినా ఈక్విటీ మార్కెట్ల‌లో వ‌చ్చిన నెగెటివ్ ర్యాలీ కార‌ణంగా రూపాయి విలువ ప‌డిపోయింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 0.07 శాతం త‌గ్గిన రూపాయి 94.73 వ‌ద్ద నిలిచింది. మంగ‌ళ‌వారం హెచ్ఎస్‌బీసీ విడుద‌ల చేసిన ఫ్లాష్ ఇండియా మానుఫాక్చ‌రింగ్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్‌లోనూ ప్ర‌తికూల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఇండెక్స్ మే నెల‌లో 58 ఉండ‌గా జూన్ వ‌ర‌కు 57.4కు ప‌డిపోయింది. ఇది కూడా మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. అయితే యుద్ధం ముగిసి శాంతి ఒప్పందం దిశ‌గా అమెరికా, ఇరాన్ వెళ్తున్న‌ప్ప‌టికీ భార‌త స్టాక్ మార్కెట్లు కోలుకోక‌పోవ‌డం పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌ల‌ను మ‌రింత పెంచుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మార్కెట్ ప‌రిస్థితుల‌ను అంచనా వేయ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement