RBI | బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.84,500 కోట్లు..! ఆర్‌బీఐ కీలక నిర్ణయం..!
RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) వేలం ద్వారా సోమవారం భారీగా నిధులను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) వేలం ద్వారా సోమవారం భారీగా నిధులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మొత్తం రూ.84,582 కోట్ల మేర బ్యాంకులకు అందించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనికి ప్రధాన కారణంగా బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెంచి, ఆర్థిక వ్యవస్థలో రుణాల ప్రవాహం సజావుగా కొనసాగించడమేనని సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ వివరాల ప్రకారం.. తొలి వీఆర్‌ఆర్ వేలంలో సుమారు రూ.50,001 కోట్లను 5.44 శాతం సగటు వడ్డీ రేటుతో అందించింది. రెండో వేలంలో రూ.34,581 కోట్లను 5.30 శాతం రేటుకు విడుదల చేసింది. మొదటి వేలానికి బ్యాంకుల నుంచి మంచి స్పందన లభించగా.. రెండో విడతలో మాత్రం అంచనాలకు తగ్గ బిడ్లు మాత్రమే వచ్చాయి.
ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చి 27 నాటికి సుమారు రూ.1.27 లక్షల కోట్ల మేర అదనపు నిధులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్బీఐ వీఆర్‌ఆర్ వేలాల ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా తాత్కాలిక లిక్విడిటీని అందించింది. అంతేకాకుండా ఈ ఏడాది జనవరి నుంచి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా రూ.3.50 లక్షల కోట్ల స్థిర లిక్విడిటీని కూడా వ్యవస్థలోకి తీసుకువచ్చింది. మరో వైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తొలి ఆరు నెలల రుణ సేకరణ ప్రణాళికను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.8.20 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ నిధులను డేటెడ్ సెక్యూరిటీస్, సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ ద్వారా సమీకరించనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






