4700BC | ప్రీమియం స్నాక్ బ్రాండ్‌ను మారికోకు విక్రయించిన పీవీఆర్ ఐనాక్స్..
4700BC | ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ సోమవారం తన ప్రీమియం స్నాకింగ్ బ్రాండ్ 4700BCని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మ్యారికోకు రూ. 226.8 కోట్లకు విక్రయించినట్లుగా ప్రకటించింది. ఈ లావాదేవీ మొత్తం పూర్తిగా ఆల్-క్యాష్ డీల్‌గా జరిగిందని పేర్కొంది.
4700BC | ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ సోమవారం తన ప్రీమియం స్నాకింగ్ బ్రాండ్ 4700BCని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మ్యారికోకు రూ. 226.8 కోట్లకు విక్రయించినట్లుగా ప్రకటించింది. ఈ లావాదేవీ మొత్తం పూర్తిగా ఆల్-క్యాష్ డీల్‌గా జరిగిందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో 4700బీసీ బ్రాండ్‌ను కలిగి ఉన్న జియా మైజ్ ప్రైవేట్ లిమిటెడ్ (ZMPL)లో తనకున్న 93.27 శాతం వాటాను మారికోకు విక్రయించేందుకు పీవీఆర్ ఐనాక్స్ ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డీల్ తర్వాత జెడ్ఎంపీఎల్ (ZMPL) తమ అనుబంధ సంస్థగా ఉండబోదని పీవీఆర్ ఇనాక్స్ కంపెనీ స్పష్టం చేసింది.
4700బీసీ భారత్‌లో ప్రముఖ ప్రీమియం గోర్మే స్నాకింగ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పాప్‌కార్న్‌తో పాటు పాప్‌డ్ చిప్స్, మఖానా, క్రంచీ కార్న్, నాచోస్ వంటి వినూత్న ఉత్పత్తులతో మంచి గుర్తింపు సంపాదించింది. వ్యూహాత్మక సమీక్షలో భాగంగా నాన్-కోర్ ఆస్తులను నగదుగా మార్చుకునేందుకు పీవీఆర్ ఇనాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ డీల్ వల్ల కంపెనీ లాభాలు, ఫ్రీ క్యాష్ ఫ్లో, రిటర్న్ రేషియోలు మెరుగుపడతాయని పేర్కొంది. ఈ విక్రయం వల్ల తమ సినిమా హాల్స్ ఫుడ్ అండ్ బివరేజెస్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా పీవీఆర్ ఇనాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ మాట్లాడుతూ 4700బీసీల ఉన్న అవకాశాన్ని తాము తొలినాళ్లలోనే గుర్తించామన్నారు. ఒక నిచ్ గోర్మే పాప్‌కార్న్ బ్రాండ్‌గా ప్రారంభమైన ప్రారంభమైందని.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రీమియం స్నాకింగ్ బ్రాండ్ స్థాయికి ఎదిగిందన్నారు. ఇక మరింత విస్తరించేందుకు, మారికో లాంటి బడా ఎఫ్ఎంసీజీ సంస్థ చేతుల్లోకి వెళ్లడం సరైందేనన్నారు. మారికో మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సౌగత గుప్తా మాట్లాడుతూ ఫాస్ట్ గ్రోయింగ్ ఫుడ్ కేటగిరీల్లో భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న ప్రత్యేకమైన బ్రాండ్లలో పెట్టుబడి పెట్టాలనే మా లక్ష్యానికి 4700బీసీ సరిపోతుందన్నారు. ఈ బ్రాండ్‌లో అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మారికో తమ ఫుడ్ వ్యాపారంలో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించి 4700బీసీని అన్ని ఛానెల్స్‌లో విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు.
సఫోలా, పారాచూట్, లివాన్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో వచ్చే మూడు సంవత్సరాల్లో ఫుడ్, ప్రీమియం పర్సనల్ కేర్ విభాగాల ద్వారా దేశీయ ఆదాయంలో 25 శాతం సాధించాలనే లక్ష్యంతో ఉంది. 2025 ఆరి్థక సంవత్సరంలో రూ.10వేల కోట్ల ఆదాయాన్ని దాటిన సంస్థ.. 2030 నాటికి రూ.20వేల కోట్ల కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. పీవీఆర్, ఐనాక్స్ రెండు విలీనమైన విషయం తెలిసిందే. పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుతం భారత్, శ్రీలంకలోని 112 నగరాల్లో 357 ప్రాపర్టీస్‌లో 1,783 స్క్రీన్స్‌ని నిర్వహిస్తోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






