త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prepaid Vs Postpaid | మొబైల్ ప్రీపెయిడ్ లేదా పోస్టు పెయిడ్‌.. రెండింటిలో ఏది బెట‌ర్‌..?

Prepaid Vs Postpaid | దేశంలో రోజు రోజుకీ సెల్‌ఫోన్ వినియోగ‌దారుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. డేటాను వాడినా, వాడ‌క‌పోయినా ఫోన్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను మాత్రం వాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే అన్ని ర‌కాల నెట్ వ‌ర్క్‌ల‌కు చెందిన వినియోగదారుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా వృద్ధి చెందుతోంది.

S

Business | Published On Jan 13, 2026, 12.46 pm IST

Prepaid Vs Postpaid | మొబైల్ ప్రీపెయిడ్ లేదా పోస్టు పెయిడ్‌.. రెండింటిలో ఏది బెట‌ర్‌..?
Advertisement

Prepaid Vs Postpaid | దేశంలో రోజు రోజుకీ సెల్‌ఫోన్ వినియోగ‌దారుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. డేటాను వాడినా, వాడ‌క‌పోయినా ఫోన్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను మాత్రం వాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే అన్ని ర‌కాల నెట్ వ‌ర్క్‌ల‌కు చెందిన వినియోగదారుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా వృద్ధి చెందుతోంది. అయితే ఫోన్ వినియోగ‌దారుల‌కు స‌హ‌జంగానే ఓ ప్ర‌శ్న త‌లెత్తుతూ ఉంటుంది. ప్రీపెయిడ్ లేదా పోస్టుపెయిడ్‌లలో ఏది అయితే బెట‌ర్‌..? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే రెండింటిలో ఏ సేవ‌ను తీసుకోవాలి అని కూడా ఆలోచిస్తుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే త‌మ స్థోమ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా ఆయా సేవ‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌ని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రీపెయిడ్‌లో అయితే..

ప్రీపెయిడ్ ప్లాన్‌ల‌లో వినియోగదారులు ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్‌లో అందించ‌బ‌డే ప్ర‌యోజ‌నాల‌ను ఉప‌యోగించుకుంటారు. డేటా లేదా కాల్స్ వంటి బెనిఫిట్స్‌ను వారు పొందుతారు. నిర్దిష్ట‌మైన ప్లాన్ లేదా మొత్తాన్ని ముందుగానే రీచార్జి చేస్తే అప్పుడు వినియోగ‌దారుడు ఎంచుకునే ప్లాన్‌కు అనుగుణంగా వాలిడిటీ ఇస్తారు. అందులోనే ఇత‌ర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు త‌మ ప్లాన్‌పై పూర్తి నియంత్ర‌ణ ఉంటుంది. ఖ‌ర్చుల‌ను నియంత్రించుకోగ‌లుగుతాడు. ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో రోజువారి ప‌రిమిత డేటా ల‌భిస్తుంది. క‌నుక త‌మ‌కు కావ‌ల్సిన డేటాను బ‌ట్టి వినియోగ‌దారులు నిర్దిష్ట‌మైన ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను ఎంచుకుని రీచార్జి చేసుకుంటారు.

పోస్ట్‌పెయిడ్ అయితే..

పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు వారి నెలవారీ బిల్లు ఆధారంగా డ‌బ్బు చెల్లిస్తారు. పోస్టుపెయిడ్ ప్లాన్‌ను తీసుకుంటే నిర్దిష్ట‌మైన మొత్తంలో డేటా ల‌భిస్తుంది. ఆ నెల‌లో డేటాను మొత్తం వినియోగించుకోక‌పోతే మిగిలిన డేటా మొత్తం మ‌రుస‌టి నెల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌బ‌డుతుంది. క‌నుక ఈ ప్లాన్లలో ల‌భించే డేటా వృథా కాదు. అలాగే బిల్లు చెల్లించ‌డం కాస్త ఆల‌స్యం అయినా నెట్ వ‌ర్క్ డిస్ క‌నెక్ట్ అవదు. దీంతో అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎంతో సౌక‌ర్యంగా ఉంటుంది. అలాగే పోస్టుపెయిడ్ ప్లాన్ల‌కు అనేక ఓటీటీ యాప్‌ల‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇలా పోస్టుపెయిడ్ ప్లాన్ల‌లో ప‌లు సేవ‌లు ల‌భిస్తున్నాయి.

ఏది బెట‌ర్‌..?

సెల్‌ఫోన్ వినియోగ‌దారులు ప్రీపెయిడ్ లేదా పోస్టుపెయిడ్ ఏది వాడాలి..? అని సందేహిస్తుంటారు. అయితే నెల‌వారి బ‌డ్జెట్ త‌క్కువ‌గా ఉన్న‌వారు, విద్యార్థులు ప్రీ పెయిడ్ ప్లాన్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఎందుకంటే టెలికాం కంపెనీలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌క్కువ ధ‌ర క‌లిగిన ప్లాన్ల‌ను అందుబాటులో ఉంచుతాయి. క‌నుక నెల అవ‌గానే అందుబాటులో ఉన్న చ‌వ‌క ప్లాన్‌ను రీచార్జి చేసుకుని వాడ‌వ‌చ్చు. ఇక ఉద్యోగులు లేదా డేటాను అధికంగా ఉప‌యోగించేవారు పోస్టుపెయిడ్ ప్లాన్ల‌ను వాడాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల డేటాను పెద్ద ఎత్తున ఉప‌యోగించుకోవ‌చ్చు. నెలా నెలా స్థిర‌మైన మొత్తంలో బిల్లు వ‌స్తుంది. ఒక వేళ కంపెనీ మీకు ఆ బిల్లును చెల్లిస్తే దాన్ని సుల‌భంగా రిడీమ్ చేసుకోవ‌చ్చు. అలాగే బిల్లు చెల్లించ‌డం కాస్త ఆల‌స్యం అయినా ప్రీపెయిడ్ లాగా నెట్‌వ‌ర్క్ వెంట‌నే డిస్ క‌నెక్ట్ అవదు. దీని వ‌ల్ల ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లోనూ డేటాకు, కాల్స్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఆయా అవ‌స‌రాలు, స్థోమ‌త‌కు త‌గిన‌ట్లుగా ఎవరికి వారు త‌మ‌కు ఏ నెట్‌వ‌ర్క్ అయితే స‌రిగ్గా ప‌నిచేస్తుందో, ఏ సేవ అయితే ఉత్త‌మంగా ఉంటుందో దాన్ని ఎంచుకుని ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం వ‌ర‌కు సౌక‌ర్య‌వంతంగా టెలికాం సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement