OnePlus | అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ భారీ ఆఫర్లు.. ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు?
OnePlus | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ సందర్భంగా వన్‌ప్లస్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూలై 4 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో డివైస్‌లపై ధర తగ్గింపులతోపాటు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే వర్తిస్తాయి.
OnePlus | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ సందర్భంగా వన్‌ప్లస్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూలై 4 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో డివైస్‌లపై ధర తగ్గింపులతోపాటు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే వర్తిస్తాయి. వన్‌ప్లస్ 15 రెండు వేరియంట్లపై బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.85,999 కాగా, గరిష్ఠంగా రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.81,999కు లభిస్తుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.93,999 కాగా, రూ.4వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.89,999కు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 15ఆర్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.54,999 నుంచి రూ.48,999కు, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.59,999 నుంచి రూ.53,999కు, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.61,999 నుంచి రూ.55,999కు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని వేరియంట్లపై రూ.3వేల ధర తగ్గింపుతోపాటు గరిష్ఠంగా రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..
వన్‌ప్లస్ 13ఎస్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.54,999 నుంచి రూ.46,999కు, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.59,999 నుంచి రూ.51,999కు లభిస్తుంది. ఇందులో రూ.5వేల ధర తగ్గింపుతోపాటు గరిష్ఠంగా రూ.3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. వన్‌ప్లస్ 13కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.54,999 కాగా, గరిష్ఠంగా రూ.5వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.49,999కు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 6లో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.42,999 నుంచి రూ.39,999కు, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.47,999 నుంచి రూ.44,999కు లభిస్తుంది. అన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 నుంచి రూ.29,999కు, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.36,999 నుంచి రూ.32,999కు లభిస్తుంది. ఇందులో రూ.2వేల వరకు ధర తగ్గింపుతోపాటు గరిష్ఠంగా రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్‌లో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.25,999 నుంచి రూ.22,999కు, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.27,999 నుంచి రూ.23,999కు, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.30,999 నుంచి రూ.26,999కు అందుబాటులో ఉంటుంది. అన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2వేల వరకు ధర తగ్గింపుతోపాటు రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
ట్యాబ్‌లపై..
ట్యాబ్లెట్లలో వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 6జీబీ, 128జీబీ వైఫై వేరియంట్ రూ.18,999 నుంచి రూ.16,999కు లభిస్తుంది. ఇందులో రూ.500 ధర తగ్గింపుతోపాటు గరిష్ఠంగా రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 8జీబీ, 128జీబీ వేరియంట్ రూ.28,999 నుంచి రూ.26,499కు లభిస్తుంది. ఇందులో రూ.500 ధర తగ్గింపుతోపాటు రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. అదనంగా రూ.3,999 విలువైన వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 స్టైలోను ఉచితంగా అందిస్తారు. వన్‌ప్లస్ ప్యాడ్ 4 8జీబీ , 256జీబీ వేరియంట్ సాధారణ ధర రూ.59,999 కాగా, గరిష్ఠంగా రూ.4వేల బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.55,999కు లభిస్తుంది. దీంతోపాటు రూ.5,499 విలువైన వన్‌ప్లస్ స్టైలో ప్రోను కూడా అదనపు ఛార్జీ లేకుండా అందిస్తారు.
ఆడియో ఉత్పత్తులపై..
ఆడియో ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. వన్‌ప్లస్ బీడబ్ల్యూజెడ్ 2 ఏఎన్‌సీ ధర రూ.2,299 నుంచి రూ.1,899కు తగ్గింది. ఇందులో రూ.250 ధర తగ్గింపుతోపాటు రూ.150 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3ఆర్ ధర రూ.1,999 నుంచి రూ.1,599కు తగ్గింది. ఇందులో రూ.200 ధర తగ్గింపుతోపాటు రూ.200 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ధర రూ.3,299 నుంచి రూ.3,099కు, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ధర రూ.3,999 నుంచి రూ.3,799కు తగ్గింది. ఈ రెండు మోడళ్లపై రూ.200 ధర తగ్గింపు వర్తిస్తుంది. వన్‌ప్లస్ బడ్స్ 4 ధర రూ.6,499 నుంచి రూ.5,599కు తగ్గింది. ఇందులో రూ.500 ధర తగ్గింపుతోపాటు రూ.400 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ధర రూ.12,999 నుంచి రూ.9,999కు లభిస్తుంది. ఇందులో రూ.2వేల ధర తగ్గింపుతోపాటు రూ.1వేయి వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రత్యేక ఆఫర్లు జూలై 4 నుంచి పరిమిత కాలం పాటు అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్‌తోపాటు వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
సంబంధిత వార్తలు

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్.. కొత్త ప్రొడక్ట్స్, భారీ డిస్కౌంట్లు..
జూన్ 29, 2026

OnePlus Nord Buds 4 | వన్‌ప్లస్ నుంచి నార్డ్ బడ్స్ 4 ఇయర్‌బడ్స్.. ఏఐ అసిస్టెంట్‌తో.. ధర తక్కువే..
జూన్ 25, 2026

OnePlus Community Sale | వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్.. ఫ్లాగ్షిప్ ఫోన్లపై భారీ తగ్గింపులు..
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Bengal refinery | హల్దియా రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మందికి గాయాలు.. రైలు సర్వీసులకు అంతరాయం
- ●FIFA 2026 | నెదర్లాండ్స్ షూటౌట్!
- ●Harish Rao | జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు : హరీశ్‌రావు
- ●BRS Party | ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు : అనిల్ బైరెడ్డి
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●WhatsApp | ఇక వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే చాట్.. యూజర్‌నేమ్ ఫీచర్ వస్తోంది..

Bengal refinery | హల్దియా రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మందికి గాయాలు.. రైలు సర్వీసులకు అంతరాయం

FIFA 2026 | నెదర్లాండ్స్ షూటౌట్!

Harish Rao | జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు : హరీశ్‌రావు

BRS Party | ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు : అనిల్ బైరెడ్డి



