IPO | ఈ వారంలో ఐపీవోల జాతర.. ఇన్వెస్టర్లకు అలర్ట్..
IPO | పశ్చిమ ఆసియాలో పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగైదు వారాలుగా మార్కెట్లు ర్యాలీ నిర్వహించి కిందటి వారంలో అస్థితరంగా కొనసాగాయి. అయితే ఈ వారంలో ఐపీవోల జాతర మొదలు కానుంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు రెడీ అవుతున్నారు.
IPO | పశ్చిమ ఆసియాలో పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగైదు వారాలుగా మార్కెట్లు ర్యాలీ నిర్వహించి కిందటి వారంలో అస్థితరంగా కొనసాగాయి. అయితే ఈ వారంలో ఐపీవోల జాతర మొదలు కానుంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు రెడీ అవుతున్నారు. ఈ వారంలో పలు కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతుండగా, పెట్టుబడిదారులు ముఖ్యమైన తేదీలను నోట్ చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అన్ని ఐపీవోలలో పెట్టుబడులు అనుకూలంగా ఉండవని, నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వారంలో మొత్తం 4 కంపెనీల ఐపీవోలు రానుండగా, మరికొన్ని కంపెనీలకు ఐపీవోల తేదీలను వెల్లడించనున్నారు.
ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీవో వివరాలు..
ఈ వారంలో వస్తున్న ఐపీవోల్లో ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీవో ప్రధానమైనది. ఈ కంపెనీ ఆధునిక వాహనాల్లో విద్యుత్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన వైరింగ్ హార్నెస్‌లు, సెన్సార్లు, స్విచ్‌లు, కంట్రోలర్లు, బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ ఏకంగా రూ.3,067 కోట్ల ఐపీఓకు వస్తోంది. ఇందులో రూ.1,400 కోట్ల తాజా షేర్ల జారీ, రూ.1,667 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఒక్కో షేరుకు గరిష్ఠ ధరను రూ.871గా నిర్ణయించారు. దీంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.17,816 కోట్లకు చేరనుంది. కంపెనీకి చెందిన 80 శాతానికి పైగా ఆదాయం టాప్ 10 కస్టమర్ల నుంచే వస్తుండడం ఈ ఐపీవో పట్ల ఆసక్తిని పెంచుతోంది. ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీవో సోమవారం నుంచి అందుబాటులోకి వస్తోంది. ఆగస్టు 12 చివరీ తేదీ. ఒక్కో షేరుకు రూ.829 నుంచి రూ.871 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. ఒక లాట్‌లో 17 షేర్లు ఉంటాయి. పెట్టుబడిదారులు కనీసం రూ.14,807 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మొత్తం ఐపీవోలో 45.7 శాతం షేర్లను తాజాగా జారీ చేస్తుండగా, 54.3 శాతం షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అందిస్తోంది.
అధిక లాభాలను ఇచ్చే సూచనలు..
ధూత్ ట్రాన్స్‌మిషన్ వాహన తయారీ సంస్థలకు నేరుగా విడిభాగాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారానే కంపెనీ భారీ ఎత్తున ఆదాయం పొందుతోంది. కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వైరింగ్ హార్నెస్‌లే అధికంగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.3,487 కోట్ల మేర ఆదాయం పొందింది. ఇందులో 77 శాతం ఆదాయాన్ని కేవలం వైరింగ్ హార్నెస్‌ల విక్రయాల ద్వారానే పొందింది. ఈ కంపెనీ భారత్‌తోపాటు యూకే, థాయ్‌లాండ్, స్లోవేకియాలలోనూ పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ సుమారుగా 8 నుంచి 10 శాతం మేర వార్షిక వృద్ధి రేటును సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పోటీ సంస్థలతో పోలిస్తే ఈ కంపెనీ ఇంకా అధిక లాభాలను ఇచ్చే దిశగా సూచనలను తెలియజేస్తుందని అంటున్నారు. అందువల్ల పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని ఐపీవోలు..
ఈ వారంలో మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్ కంపెనీ కూడా ఐపీవోకు వస్తోంది. మొత్తం రూ.1,553 కోట్ల విలువైన ఐపీవోకు ఆగస్టు 11న ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 13 వరకు గడువు ఉంది. ఇక లీప్ ఇండియా కంపెనీ ఐపీవో ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 11 వరకు గడువుంది. మొత్తం రూ.2,480 కోట్ల ఐపీవోకు ఈ కంపెనీ ప్రస్తుతం బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తోంది. అలాగే బేహరి లాల్ ఇంజినీరింగ్ కంపెనీ రూ.1617 కోట్ల మేర ఐపీవోకు రానుండగా, ఆగస్టు 12 నుంచి 14వ తేదీ వరకు కాలవ్యవధిని నిర్ణయించారు. ఇక ఇవే కాకుండా ఈ వారంలో హారిజాఆన్ ఇండస్ట్రియల్ పార్క్స్ రూ.2500 కోట్ల మేర ఐపీవోకు తేదీలను ప్రకటించనుండగా, గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ.549 కోట్ల తాజా, రూ.107 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఐపీవోకు, స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ రూ.700 కోట్ల ఐపీవోకు, సన్‌షైన్ పిక్చర్స్ రూ.83 లక్షల మేర ఐపీవోకు తేదీను ప్రకటించనున్నాయి. దీంతో పెట్టుబడిదారులు వీటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..
- ●Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం
- ●Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
- ●Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..
- ●Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
- ●AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..

Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం

Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి

Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..






