EPFO | పాత పీఎఫ్ ఖాతాను వెదకడం ఇక సులభం.. ఆధార్‌తో కొత్త ఈపీఎఫ్‌వో పోర్టల్..
EPFO | ఉద్యోగం మారిన తర్వాత పాత కంపెనీలోని పీఎఫ్ ఖాతా ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? పాత పీఎఫ్ అకౌంట్ ఇప్పటికీ కనిపించడం లేదా? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ పోర్టల్ అభివృద్ధి దశలో ఉండగా, త్వరలోనే అందుబాటులోకి రానుంది.
EPFO | ఉద్యోగం మారిన తర్వాత పాత కంపెనీలోని పీఎఫ్ ఖాతా ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? పాత పీఎఫ్ అకౌంట్ ఇప్పటికీ కనిపించడం లేదా? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ పోర్టల్ అభివృద్ధి దశలో ఉండగా, త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్ ద్వారా కేవలం ఆధార్ నంబర్‌తోనే పాత పీఎఫ్ ఖాతాను గుర్తించవచ్చు. అలాగే ఆ ఖాతాను యాక్టివేట్ చేసుకుని అందులో ఉన్న బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవచ్చు. అవసరమైతే పాత పీఎఫ్ ఖాతాలోని నగదును కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్వీర్యమైన ఖాతాలను పరిష్కరించి, క్లెయిమ్ చేయని నిధులను లబ్ధిదారులు పొందేందుకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈపీఎఫ్‌వో ఈ కొత్త పోర్టల్‌ను తీసుకువస్తోంది.
రూ.9వేల కోట్లకు పైగా క్లెయిమ్ చేయని నిధులు..
ఉద్యోగం మారిన తర్వాత పాత పీఎఫ్ ఖాతాను యాక్సెస్ చేయడం, అందులోని నగదును ఉపసంహరించుకోవడం చాలా మందికి కష్టంగా మారుతోంది. పేపర్‌వర్క్, వెరిఫికేషన్ వంటి అనేక ప్రక్రియల కారణంగా చాలామంది తమ డబ్బును క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈపీఎఫ్‌వో సుమారు 30,91,862 నిర్వీర్యమైన పీఎఫ్ ఖాతాలను గుర్తించింది. వాటిలో సుమారు రూ.9,330 కోట్ల మేర క్లెయిమ్ చేయని నిధులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆధార్ ఆధారిత డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఆధార్ నంబర్‌తో పాత ఖాతాలను గుర్తించి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే పాత ఖాతాలోని బ్యాలెన్స్‌ను ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న యూఏఎన్‌కు బదిలీ చేసుకోవచ్చు. కేవలం ఒక ఆధార్ నంబర్‌తోనే ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
యూఏఎన్ లేని వారికి ఊరట..
ఈ కొత్త పోర్టల్ ముఖ్యంగా 2014లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) వ్యవస్థ ప్రవేశపెట్టకముందు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడనుంది. యూఏఎన్ అమల్లోకి రాకముందు చాలా మంది ఉద్యోగులకు వేర్వేరు యజమానుల వద్ద వేర్వేరు ఈపీఎఫ్ ఖాతా నంబర్లు ఉండేవి. అయితే అవి యూఏఎన్‌తో అనుసంధానం కాలేదు. దీంతో పాత ఖాతాలను గుర్తించడం, అందులోని డబ్బును ఉపసంహరించుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటివరకు పాత పీఎఫ్ ఖాతాలను గుర్తించేందుకు చాలా మంది ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తులు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై ఇంటి నుంచే పాత ఖాతాలను గుర్తించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది. దీంతో పీఎఫ్ కార్యాలయాలపై పని భారం కూడా తగ్గనుంది. అయితే ఈ పోర్టల్‌ను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారు అన్న వివరాలను మాత్రం కేంద్రం వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Spain | స్పెయిన్‌లోకి వేలాది మంది మొరాకో శరణార్థులు.. సరిహద్దు దాటే క్రమంలో తొమ్మిది మంది మృతి
- ●Balakrishna Daughter | హీరోయిన్గా బాలకృష్ణ కూతురు - ఊహించని రోల్‌తో ఎంట్రీ
- ●Godavari Fierce Flood | గోదావరి ఉగ్రరూపం.. ఇసుక పాయల్లో చిక్కుకున్న 38 మంది
- ●Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
- ●Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు
- ●OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Spain | స్పెయిన్‌లోకి వేలాది మంది మొరాకో శరణార్థులు.. సరిహద్దు దాటే క్రమంలో తొమ్మిది మంది మృతి

Balakrishna Daughter | హీరోయిన్గా బాలకృష్ణ కూతురు - ఊహించని రోల్‌తో ఎంట్రీ

Godavari Fierce Flood | గోదావరి ఉగ్రరూపం.. ఇసుక పాయల్లో చిక్కుకున్న 38 మంది

Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి






