Harish Rao | సీఎంవా..? స్ట్రీట్ రౌడీవా..? రేవంత్‌పై నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై, అడ్డగోలు మాటలపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నువ్వేమైనా ముఖ్యమంత్రివా..? స్ట్రీట్ రౌడీవా..? అని నిలదీశారు. స్ట్రీట్ రౌడీలు కూడా నీ కంటే మంచిగా మాట్లాడుతారని రేవంత్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు అన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై, అడ్డగోలు మాటలపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నువ్వేమైనా ముఖ్యమంత్రివా..? స్ట్రీట్ రౌడీవా..? అని నిలదీశారు. స్ట్రీట్ రౌడీలు కూడా నీ కంటే మంచిగా మాట్లాడుతారని రేవంత్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ రోజు సభా నడిపినటువంటి తీరు బాలేదు. అంతా ఏకపక్షంగా ఒకే సైడ్ నడపడం పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి బయటకు వచ్చాం. ఈ సభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ, శాసనసభ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ సభను నిర్వహిస్తున్నారు. మొన్న బీఏసీ మీటింగ్‌కు అధికార పార్టీ నేతలు గంటన్నర సేపు ఆలస్యంగా వచ్చారు. బీఏసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు వేరు. బీఏసీ నిర్ణయాలు అని ఈరోజు సభలో పెట్టింది పూర్తిగా వేరు. ప్రస్తుతానికి ఏడు రోజులు సభ నిర్వహిస్తామని బీఏసీలో నిర్ణయించారు. కానీ ఇవాళ అలాంటి విషయాలు ప్రస్తావన తేకుండా నోట్ ఇచ్చారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ నిర్ణయానికి వదిలేశామని చెప్పారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదోవ పట్టించారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
బూతులమయంగా అసెంబ్లీ..
ఇక సభ నడిపే తీరు అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మూసీ ప్రక్షాళనపై ప్రశ్నలు సంధిస్తే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడారు. మూసీ మీద చర్చ జరగాలంటే స్వల్పకాలిక చర్చ పెట్టాలి. ఆయన నోటికి హద్దు లేదు. అసెంబ్లీని బూతులమయం చేశారు. ఎన్ని బూతులు మాట్లాడినా, అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ ఆపే ప్రయత్నం చేయరు. సీఎం వ్యాఖ్యలపై మేం సూచన చేస్తామంటే మాకు మైక్ ఇవ్వరు. కానీ ఇంకో విపక్షానికి మైక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మేం సభకు రావడం ఎందుకు..? ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రధానిని విమర్శించడం లేదా..? ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్
మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి కంపు ఎక్కువైపోయింది. మూసీ ప్రక్షాళన కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను గాంధీ భవన్‌లా మార్చారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అసెంబ్లీలో సొల్లు మాట్లాడారు. మూసీకి తెచ్చే నీళ్లు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి తెస్తున్నారా..? అంటే సమాధానం లేదు. మేం మూసీకి వ్యతిరేకం కాదు.. పేదల ఇండ్ల కూల్చివేతలకు వ్యతిరేకం. 2013 చట్టం ప్రకారం బాధితులకు డబ్బుల్లిస్తే.. ఆ వివరాలు చెప్పాలంటే సమాధనం లేదు. మేం ప్రజల పక్షాన మాట్లాడితే.. ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించేదే బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళన కోసం 32 ఎస్టీపీలు కట్టింది.. మరో 31 ఎస్టీపీలకు అమృత్ పథకం కింద ప్రతిపాదనలు పంపామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కేసీఆర్‌ను పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతావా..?
రేవంత్ ఎప్పుడూ బాడీ షేమింగ్ చేస్తారు ఎదుటి వారి మీద. పొడుగు ఎక్కువ ఉన్నవ్. అద్దాలు పెట్టుకున్నవ్. ఏం ఈ చిల్లర మాటలు. నువ్వేమైనా ముఖ్యమంత్రివా..? స్ట్రీట్ రౌడీవా..? స్ట్రీట్ రౌడీలు కూడా నీ కంటే మంచిగా మాట్లాడుతారు. కేసీఆర్ మీద నువ్వు పదే పదే చావు భాష కోరుకుంటావా..? తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌ను పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతావ్. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి. నీళ్ల ద్రోహివి. అలాంటి నీవు కేసీఆర్ పట్ల అలాంటి భాషను మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నాం..
రాహుల్ గాంధీ పొద్దున లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతాడు. ఇక్కడేమో రాజ్యాంగం ఖూనీ అవుతుంది. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వడం లేదు. సీఎంను విమర్శ చేయొద్దని మైక్ ఇవ్వను అని స్పీకర్ అంటున్నడు. స్పీకర్ పక్షపాతి వైఖరికి నిరసనగా ఈ సెషన్‌ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్‌కు అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత ఉంటుంది. మేం ఒక్క అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తరు. సీఎం నోటికి అడ్డు అదుపు లేకండా చిల్లర మాటలు మాట్లాడితే ఆపే ప్రయత్నం చేయరు. అవినీతికి అడ్డాగా మారింది రాష్ట్రం. అవినీతిమయం చేశారు. అవినీతి గురించి మాట్లాడే నైతికత ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం తీరును, శాసనసభ నడుస్తున్న తీరు, స్పీకర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. సభ ఏకపక్షంగా నడుపుతున్నారు. స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



