New IT Rules 2026 | ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 15 ముఖ్య రూల్స్ ఇవే..!
New IT Rules 2026 | ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను విభాగం ద్వారా విస్తృతంగా తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూలు) విడుదల చేసింది.
New IT Rules 2026 | ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను విభాగం ద్వారా విస్తృతంగా తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూలు) విడుదల చేసింది. ఇవి ఫైనాన్స్ బిల్-2026లో భాగంగా ఉండటంతో, ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బయటికి పెద్దగా చర్చకు రాని ఈ మార్పులు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో పన్ను రిటర్నుల దాఖలు, ఆదాయ ప్రకటన, జరిమానాలు, నేర విచారణలు, టీడీఎస్ నియమాలు, నోటీసుల వ్యవహారాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.
1. అప్‌డేటెడ్ రిటర్న్ గడువు నాలుగేళ్లు
ఇకపై నాలుగేళ్ల వరకు అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయొచ్చు. అయితే ఆలస్యం ఎంత ఎక్కువైతే అదనపు పన్ను కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇది 25 శాతం నుంచి 70 శాతం వరకు పెరుగుతుంది.
2. నష్టాల సవరణకు అవకాశం
ముందుగా ప్రకటించిన నష్టాలను అప్‌డేటెడ్ రిటర్న్ ద్వారా తగ్గించుకునే వెసులుబాటు కల్పించారు.
3. రీఅసెస్‌మెంట్ నోటీసు వచ్చిన తర్వాత కూడా అప్‌డేటెడ్ రిటర్న్
మళ్లీ అంచనా నోటీసు వచ్చినా అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. అలా వెల్లడించిన ఆదాయంపై జరిమానా ఉండదు.
4. నాన్ ఆడిట్ కేసులకు రిటర్న్ గడువు పొడిగింపు
నాన్ ఆడిట్ వ్యాపారాలు, ట్రస్టులకు రిటర్న్ దాఖలు చివరి తేదీ జూలై 31 నుంచి ఆగస్టు 31కి పొడిగించారు.
5. మోటారు ప్రమాద పరిహారంపై వడ్డీ పూర్తిగా పన్ను మినహాయింపు
మోటారు ప్రమాద పరిహారంలో భాగంగా లభించే వడ్డీపై ఇకపై ఎలాంటి పన్ను ఉండదు. టీడీఎస్ కూడా ఉండదు.
6. ఎన్‌ఆర్‌ఐ నుంచి ఆస్తి కొనుగోలుకు టీఏఎన్ అవసరం లేదు
నాన్ రెసిడెంట్ నుంచి ఆస్తి కొనుగోలు చేసే వారు ఇకపై టీఏఎన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ ఆధారిత టీడీఎస్ సరిపోతుంది.
7. మాన్‌పవర్ సరఫరా స్పష్టంగా కాంట్రాక్ట్ పనిగా గుర్తింపు
మాన్‌పవర్ సరఫరాను పని నిర్వచనంలోకి తీసుకురావడంతో టీడీఎస్ విషయంలో స్పష్టత వచ్చింది.
8. తక్కువ లేదా శూన్య టీడీఎస్ సర్టిఫికెట్లకు సులభ మార్గం
చిన్న పన్ను చెల్లింపుదారులు ఇకపై ఆన్‌లైన్ ద్వారా తక్కువ లేదా నిల్ టీడీఎస్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
9. మ్యూచువల్ ఫండ్లు, డివిడెండ్లు, బాండ్ ఆదాయానికి ఒకే డిక్లరేషన్
వేర్వేరు ఫారాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒకే డిక్లరేషన్ సరిపోతుంది.
10. వివరణలేని ఆదాయంపై పన్ను భారీగా తగ్గింపు
ఇంతకుముందు 60 శాతం ఉన్న పన్ను రేటును 30 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా ప్రకటిస్తే జరిమానా ఉండదు.
11. అసెస్‌మెంట్, పెనాల్టీ ఒకే ఉత్తర్వులో
అసెస్‌మెంట్‌తో పాటు జరిమానా ఉత్తర్వులను ఒకేసారి జారీ చేసే వీలుంది.
12. పెనాల్టీ, ప్రాసిక్యూషన్ నుంచి విస్తృత రక్షణ
మిస్‌రిపోర్టింగ్ కేసులకూ అదనపు పన్ను చెల్లిస్తే రక్షణ కల్పిస్తారు.
13. కొన్ని పెనాల్టీలు ఆటోమేటిక్ ఫీజులుగా మార్పు
ఆడిట్ ఆలస్యం వంటి తప్పులకు ఫిక్స్‌డ్ ఫీజులను ఆటోమేటిక్‌గా విధిస్తారు.
14. ఆదాయపు పన్ను నేరాల డీక్రిమినలైజేషన్
చాలా నేరాలకు జైలు శిక్షలు తగ్గింపు, చిన్న తప్పులను క్రిమినల్ కేసుల పరిధి నుంచి తొలగించారు.
15. ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపుల గడువు సమన్వయం
ఐటీఆర్ గడువు వరకు చెల్లిస్తే పీఎఫ్, ఈఎస్‌ఐపై డిడక్షన్ పొందవచ్చు.
ఎందుకు ఇవి ముఖ్యమంటే?
ఈ మార్పులన్నీ చూస్తే బడ్జెట్ 2026 కేవలం పన్ను రేట్లకే పరిమితం కాదని స్పష్టమవుతోంది. పన్ను చెల్లింపుదారుల ప్రవర్తన, అనుసరణ, అమలు విధానాలను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేసినట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టంలో ఈ సైలెంట్ మార్పులు కూడా పన్ను చెల్లింపుదారులకు అంతే కీలకంగా మారనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారా.. అయితే ఈ తప్పులను చేయకండి..
మే 6, 2026

Cognizant Layoffs | కాగ్నిజెంట్‌లో 15 వేలమందిపై వేటు.. భారత్‌లోనే అధికం..!
మే 6, 2026

New Online Gaming Rules 2026 | కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ అమల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.1 కోటి ఫైన్, 3 ఏళ్ల జైలు శిక్ష..
మే 1, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



