National Career Service | ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు.. కేంద్ర కార్మిక శాఖ కీలక హెచ్చరిక..
National Career Service | ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, ఉద్యోగ ఆఫర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఉద్యోగ రిజిస్ట్రేషన్, దరఖాస్తులు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
National Career Service | ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, ఉద్యోగ ఆఫర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఉద్యోగ రిజిస్ట్రేషన్, దరఖాస్తులు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు, సంస్థలు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్)తో సంబంధం ఉందంటూ నకిలీ ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, ఉద్యోగ నియామక ఆఫర్లు పంపుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రిత్వ శాఖ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తులు, సంస్థలను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఎన్‌సీఎస్ లేదా కేంద్ర కార్మిక శాఖ పేరుతో వెబ్‌సైట్లు, యజమానులు, వ్యక్తులు పంపే తప్పుడు సమాచారాన్ని విశ్వసించవద్దని హెచ్చరించింది.
ఎన్‌సీఎస్ సేవలన్నీ పూర్తిగా ఉచితం..
నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా అందించే అన్ని సేవలు పూర్తిగా ఉచితమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం, ఇంటర్వ్యూ ప్రక్రియ, ఇతర ఉపాధి సంబంధిత సేవల కోసం అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే యజమానులు లేదా మధ్యవర్తులకు కూడా డబ్బులు చెల్లించవద్దని సూచించింది. ఇలాంటి చెల్లింపులను ఎన్‌సీఎస్ ప్రోత్సహించదని, వాటికి బాధ్యత వహించదని తెలిపింది. ఎన్‌సీఎస్ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, వ్యక్తుల ఉదంతాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది.
మోసాలను గుర్తించడం, ఫిర్యాదు చేయడం ఎలా?
ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.ncs.gov.in ను మాత్రమే సందర్శించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వ్యక్తిగత వివరాలు పంచుకునే ముందు, అనుమానాస్పద ఉద్యోగ ఆఫర్లకు స్పందించే ముందు వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని తెలిపింది. అనుమానాస్పద కాల్స్, ఈ-మెయిల్స్ లేదా ఉద్యోగ మోసాలకు గురైన వారు 1514 నంబర్ ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ఆర్థిక మోసాలకు గురైతే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సహాయం కోసం support.ncs@gov.in అధికారిక ఈ-మెయిల్‌ను కూడా సంప్రదించవచ్చు. నకిలీ ఉద్యోగ ఆఫర్లు, మోసపూరిత కాల్స్, ఈ-మెయిల్స్ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కార్మిక శాఖ మరోసారి స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్
- ●Personal Finance | 20 ఏళ్ల వయస్సులో చేసే ఈ 5 ఆర్థిక తప్పులతో.. భవిష్యత్తులో లక్షల నష్టం..
- ●Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చనిపోయిందంటే!
- ●Industrial Espionage | ప్రపంచాన్ని షేక్ చేసిన కార్పొరేట్ సీక్రెట్స్.. ఆ కంపెనీల రహస్యాల చోరీ వెనుక అసలు కథ!
- ●Stock Markets | నిఫ్టీ 25,000 దాటినా.. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి..
- ●Delhi Air Pollution | ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేతలు కుట్ర : బీజేపీ మంత్రి

Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్

Personal Finance | 20 ఏళ్ల వయస్సులో చేసే ఈ 5 ఆర్థిక తప్పులతో.. భవిష్యత్తులో లక్షల నష్టం..

Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చనిపోయిందంటే!

Industrial Espionage | ప్రపంచాన్ని షేక్ చేసిన కార్పొరేట్ సీక్రెట్స్.. ఆ కంపెనీల రహస్యాల చోరీ వెనుక అసలు కథ!






