Elon Musk | డబ్బుతో సంతోషాన్ని కొనలేము.. ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్
Elon Musk | డబ్బుతో కొన్ని కొనగలమేమో గానీ సంతోషాన్ని మాత్రం కొనలేమన్నది (money can’t buy happiness) సామెత. ఈ సామెతను ఇప్పుడు ప్రపంచ కుబేరుడు (worlds richest person), టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గుర్తుచేసుకున్నారు.
Elon Musk | డబ్బుతో కొన్ని కొనగలమేమో గానీ సంతోషాన్ని మాత్రం కొనలేమన్నది (money can’t buy happiness) సామెత. ఈ సామెతను ఇప్పుడు ప్రపంచ కుబేరుడు (worlds richest person), టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. "డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని ఎవరైతే చెప్పారో.. వారికి అసలు విషయం బాగా తెలుసు" అని పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కి బాధపడుతున్న ఎమోజీని జతచేశారు.
సాధారణంగానే మస్క్ చేసే ప్రతీ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా క్షణాల్లో వైరల్‌గా మారింది. రూ.కోట్లకు పడగలెత్తిన మస్క్ ఇలాంటి పోస్టు పెట్టడంపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ మేరకు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ కుబేరుడైన మస్క్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు..? మస్క్ సంతోషంగా లేరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. "అవును మస్క్ చెప్పింది నిజమే" అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మస్క్ ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు పెట్టారన్నదానిపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.
https://x.com/elonmusk/status/2019212107020136611
సంపదలో మస్క్ రికార్డు..
మరోవైపు ఆదాయం విషయంలో మస్క్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. మస్క్ యాజమాన్యంలోని స్పేస్‌ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల విలీనంతో టెస్లా బాస్ సంపద అమాంతం పెరిగింది. మస్క్ సంపద 800 బిలియన్ డాలర్లు దాటింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. స్పేస్ ఎక్స్, కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌ఏఐ విలీనం తర్వాత మస్క్ వ్యక్తిగత సంపద భారీగా పెరిగి 852 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.70లక్షల కోట్లు)కు చేరుకుంది. ఫలితంగా ప్రపంచంలోనే 800 బిలియన్ డాలర్ల నికర సంపదను అధిగమించిన మొదటి వ్యక్తిగా మాస్క్ రికార్డులకెక్కారు.
సంబంధిత వార్తలు

X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
మే 18, 2026

Grok Build | కోడింగ్ ఏజెంట్‌గా సేవలు అందించనున్న గ్రోక్ ఏఐ.. గ్రోక్ బిల్డ్ వచ్చేసింది..
మే 15, 2026

XChat | వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ చాట్.. నేటి నుంచే లభ్యం.. స్క్రీన్షాట్లు తీయకుండా లాక్ ఫీచర్..
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



