HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..
HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఉద్యోగులకు 18,97,180 ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ పథకాలు (ఈఎస్ఓఎస్) కింద ఆప్షన్స్, ఆర్ఎస్‌యూలను ఉద్యోగులు వినియోగించుకోవడంతో ఈ షేర్లను కేటాయించినట్లు శుక్రవారం నియంత్రణ సంస్థకు సమర్పించిన నివేదికలో బ్యాంక్ వెల్లడించింది.
HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఉద్యోగులకు 18,97,180 ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ పథకాలు (ఈఎస్ఓఎస్) కింద ఆప్షన్స్, ఆర్ఎస్‌యూలను ఉద్యోగులు వినియోగించుకోవడంతో ఈ షేర్లను కేటాయించినట్లు శుక్రవారం నియంత్రణ సంస్థకు సమర్పించిన నివేదికలో బ్యాంక్ వెల్లడించింది. ఈ షేర్ల కేటాయింపుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెల్లించిన షేర్ మూలధనం పెరిగింది. గతంలో 15,41,67,00,168గా ఉన్న రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల సంఖ్య తాజాగా 15,41,85,97,348కు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధరను పరిశీలిస్తే.. వివిధ కాల వ్యవధుల్లో స్టాక్ నుంచి పెద్దగా రాబడులు కనిపించలేదు. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో షేర్ ధర సుమారు 0.5 శాతం తగ్గగా, గత నెలలో 0.9 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో సుమారు 6 శాతం క్షీణించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 25.98 శాతం పడిపోయింది. గతేడాది కాలంలో 22.7 శాతం, గత ఐదేళ్లలో సుమారు 8 శాతం తగ్గింది.
అక్టోబర్ 17న ఫలితాలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను అక్టోబర్ 17న ప్రకటించనుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, ప్రథమార్థానికి సంబంధించిన స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను పరిశీలించి ఆమోదించేందుకు అదే రోజు బ్యాంక్ బోర్డు సమావేశం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెక్యూరిటీల ట్రేడింగ్ విండో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 19 వరకు మూసి ఉంటుంది. ఈ రెండు తేదీలు కూడా ఇందులో ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ.19,059 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.18,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే రూ.19,720 కోట్లుగా ఉన్న బ్లూమ్‌బెర్గ్ అంచనాల కంటే తాజా లాభం తక్కువగా ఉంది.
పెరిగిన వడ్డీ ఆదాయం..
నికర వడ్డీ ఆదాయం కూడా వార్షిక ప్రాతిపదికన 6.7 శాతం పెరిగింది. గతేడాది ఇదే కాలంలో రూ.31,438 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈసారి రూ.33,534 కోట్లకు చేరుకుంది. అయితే రూ.34,257 కోట్లుగా ఉన్న బ్లూమ్‌బెర్గ్ అంచనాలను ఇది అందుకోలేదు. ఇక కేటాయింపులు రూ.3,060 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.14,441 కోట్లతో పోలిస్తే ఇవి గణనీయంగా తగ్గాయి. ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే.. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) నిష్పత్తి 1.15 శాతం నుంచి 1.17 శాతానికి పెరిగింది. నికర ఎన్‌పీఏ కూడా 0.38 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగింది. మరోవైపు, గత త్రైమాసికంలో రూ.2,610 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,060 కోట్లకు పెరిగాయి.
సంబంధిత వార్తలు

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్నవారికి ఊరట..
సెప్టెంబర్ 7, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ.. పెరిగిన చమురు ధరలే కారణం..
సెప్టెంబర్ 3, 2026

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి



