త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Best Selling EVs | టాటా పంచ్‌ను దాటేసిన మ‌హీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌

Best Selling EVs | దేశీయ ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. ఆగస్టు 2026లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్‌ కారుగా నిలిచింది. ఫ్యాక్టరీ నుంచి డీలర్లకు జరిగిన డిస్పాచ్‌ల ఆధారంగా మహీంద్రా XEV 9Sకు 4,508 యూనిట్ల విక్రయాలు జ‌రిగాయి.

P

Business | Published On Sep 26, 2026, 9.10 pm IST

Best Selling EVs | టాటా పంచ్‌ను దాటేసిన మ‌హీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌
Advertisement

Best Selling EVs | దేశీయ ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. ఆగస్టు 2026లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్‌ కారుగా నిలిచింది. ఫ్యాక్టరీ నుంచి డీలర్లకు జరిగిన డిస్పాచ్‌ల ఆధారంగా మహీంద్రా XEV 9Sకు 4,508 యూనిట్ల విక్రయాలు జ‌రిగాయి. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టాటా పంచ్‌ ఈవీ రెండో స్థానానికి పరిమితమైంది. పంచ్‌ ఈవీ 4,430 యూనిట్లతో నిలిచింది. ఇరు మోడళ్ల మధ్య తేడా కేవలం 78 యూనిట్లు కావడం గమనార్హం. 2026 జనవరిలో కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్స్ఈవీ 9ఎస్‌కు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. జూలైలో 4,131 యూనిట్లుగా ఉన్న డిస్పాచ్‌లు.. ఆగస్టులో 4,508 యూనిట్లకు చేరాయి. అంటే నెలవారీగా 9.1 శాతం వృద్ధి నమోదైంది.

మూడు బ్యాటరీ ఆప్షన్లు

ఏడు సీట్ల ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ అయిన ఎక్స్ఈవీ 9ఎస్‌ను మహీంద్రా మూడు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో అందిస్తోంది. 59kWh, 70kWh, 79kWh బ్యాటరీలు ఇందులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జింగ్‌తో 521 కిలోమీటర్ల నుంచి 679 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.20.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, టాప్‌-10 ఎలక్ట్రిక్‌ కార్ల జాబితాలో టాటా మోటార్స్‌ మోడళ్ల ఆధిపత్యం కొనసాగింది. పంచ్‌ ఈవీ 4,430 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా.. నెక్సాన్‌ ఈవీ 3,975 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది.

పెరిగిన నెక్సాన్ ఈవీ అమ్మ‌కాలు

గతేడాది ఆగస్టుతో పోలిస్తే నెక్సాన్‌ ఈవీ అమ్మకాలు 44 శాతం పెరిగాయి. హారియర్‌ ఈవీ 2,103 యూనిట్లతో ఐదో స్థానం, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన సియెరా ఈవీ 1,930 యూనిట్లతో ఏడో స్థానం, టియాగో ఈవీ 1,730 యూనిట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టాప్‌-10లో ఉన్న ఈ ఐదు టాటా మోడళ్లు కలిపి 14,168 యూనిట్ల డిస్పాచ్‌లు రికార్డ‌య్యాయి. ఎంజీ విండ్సర్‌ ఈవీ విక్రయాలు గతేడాది ఆగస్టులో నమోదైన 4,511 యూనిట్లతో పోలిస్తే 18 శాతం తగ్గాయి. మరోవైపు మహీంద్రా బీఈ6 విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం వృద్ధి చెందాయి. కొత్తగా వచ్చిన విన్‌ఫాస్ట్‌ లిమోగ్రీన్‌ కూడా 1,901 యూనిట్లతో టాప్‌-10లో చోటు దక్కించుకుంది.

టాప్‌-10 జాబితా ఇదే..

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ – 4,508 యూనిట్లు
టాటా పంచ్‌ ఈవీ – 4,430 యూనిట్లు
టాటా నెక్సాన్‌ ఈవీ – 3,975 యూనిట్లు
ఎంజీ విండ్సర్‌ ఈవీ – 3,705 యూనిట్లు
టాటా హారియర్‌ ఈవీ – 2,103 యూనిట్లు
మహీంద్రా XEV 9e – 2,001 యూనిట్లు
టాటా సియెరా ఈవీ – 1,930 యూనిట్లు
విన్‌ఫాస్ట్‌ లిమోగ్రీన్‌ – 1,901 యూనిట్లు
టాటా టియాగో ఈవీ – 1,730 యూనిట్లు
మహీంద్రా బీఈ 6 – 1,696 యూనిట్లు

Advertisement
Advertisement