త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIC | ఎల్ఐసీలో ఈ ప‌థ‌కంలో చేరండి.. రిటైర్ అయ్యాక నెల‌కు రూ.21వేలు పెన్ష‌న్ వ‌స్తుంది..

LIC | రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం చాలా మంది తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసి పెట్టుబడులు పెడుతుంటారు. వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం రావాలంటే పెన్షన్ పథకాలు మంచి ఎంపికగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ అందిస్తున్న సరళ్ పెన్షన్ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

S

Business | Published On Jun 13, 2026, 3.32 pm IST

LIC | ఎల్ఐసీలో ఈ ప‌థ‌కంలో చేరండి.. రిటైర్ అయ్యాక నెల‌కు రూ.21వేలు పెన్ష‌న్ వ‌స్తుంది..
Advertisement

LIC | రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం చాలా మంది తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసి పెట్టుబడులు పెడుతుంటారు. వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం రావాలంటే పెన్షన్ పథకాలు మంచి ఎంపికగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ అందిస్తున్న సరళ్ పెన్షన్ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం గ్యారంటీ పెన్షన్ పొందే అవకాశం ఈ పథకంలో ఉంది. ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ సింగిల్ ప్రీమియం ప్లాన్. అంటే ఇందులో ఒకేసారి మొత్తం పెట్టుబడి చేయాలి. ఆ తర్వాత జీవితాంతం నిర్ణీత పెన్షన్ అందుతుంది. ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం రూపొందించిన ఈ పాలసీ, రిటైర్మెంట్ ఫండ్‌లు లేదా గ్రాట్యుటీ మొత్తాన్ని పెట్టుబడిగా మార్చి వెంటనే పెన్షన్ పొందాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ పథకంలో ఒకసారి నిర్ణయించిన పెన్షన్ మొత్తం జీవితాంతం మారదు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ముందుగా నిర్ణయించిన మొత్తమే నిరంతరం అందుతుంది. అందువల్ల స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గ్యారంటీడ్ పెన్ష‌న్ సదుపాయం..

ఈ పాలసీని వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు కలిసి కూడా జాయింట్‌గా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో చేరేందుకు కనీస వయస్సు 40 సంవత్సరాలు కాగా, గరిష్ఠ వయస్సు 80 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇందులో గ్యారంటీ పెన్షన్ సదుపాయం ఉండటంతో పెట్టుబడిదారులకు భరోసా లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన తేదీ నుంచి ఆరు నెలలు పూర్తైన తర్వాత సరళ్ పెన్షన్ పాలసీని సరెండర్ చేసే అవకాశం కూడా ఉంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో పెట్టుబడిగా చెల్లించిన మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లిస్తారు. అలాగే పాలసీపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం కూడా కనీసం ఆరు నెలలు పూర్తై ఉండాలి.

నెలకు రూ.21వేలు కావాలంటే..

ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.12వేలు అన్యుటీ కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్‌ను నెలవారీగా పొందవచ్చు. అలాగే త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. పెట్టుబడిదారుడు తన అవసరాలకు అనుగుణంగా చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే నెలకు సుమారు రూ.21వేల కంటే ఎక్కువ పెన్షన్ ఎలా పొందవచ్చో ఒక ఉదాహరణ చూద్దాం. ఎల్‌ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం, 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టి అన్యుటీ కొనుగోలు చేస్తే, అతనికి సంవత్సరానికి రూ.2,62,454 పెన్షన్ లభిస్తుంది. దీనిని నెలవారీగా లెక్కిస్తే సుమారు రూ.21,871 పెన్షన్ అవుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement