Retirement Schemes | ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్.. వీటిలో ఏది రిటైర్మెంట్ వయస్సులో ఉత్తమ రాబడిని ఇస్తుంది..?
Retirement Schemes | భారతీయ జీతభత్య ఉద్యోగుల కోసం రిటైర్మెంట్ సేవింగ్స్‌లో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించే పథకాలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ నిర్వహించే ఎన్‌పీఎస్ (NPS). జీతం, పన్ను ఆదా లక్ష్యాలు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి అంశాల ఆధారంగా ఉద్యోగులు వీటిలో సరైన పథకాన్ని ఎంచుకోవచ్చు.
Retirement Schemes | భారతీయ జీతభత్య ఉద్యోగుల కోసం రిటైర్మెంట్ సేవింగ్స్‌లో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించే పథకాలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ నిర్వహించే ఎన్‌పీఎస్ (NPS). జీతం, పన్ను ఆదా లక్ష్యాలు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి అంశాల ఆధారంగా ఉద్యోగులు వీటిలో సరైన పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ ఎక్కువ మంది ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్‌గా ఉంటుంది. ఇది ప్రభుత్వ మద్దతుతో స్థిరమైన రాబడులను అందించడమే కాకుండా యజమాని నుంచి కూడా కాంట్రిబ్యూషన్ లభిస్తుంది. పీపీఎఫ్ మాత్రం రిస్క్ తీసుకోకుండా దీర్ఘకాలికంగా పన్ను రహిత ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఫ్లెక్సిబుల్ డిపాజిట్లు ఉండగా ప్రస్తుతం 7.1 శాతం గ్యారంటీ వడ్డీ అందుతోంది. ఎన్‌పీఎస్ విషయానికి వస్తే ఇందులో ఈక్విటీ, డెట్ రెండింటి మిశ్రమం ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో భారీ రిటైర్మెంట్ కార్పస్ సృష్టించే అవకాశం ఉంటుంది. పాత పన్ను విధానంలో అదనపు ట్యాక్స్ డిడక్షన్లు కూడా లభిస్తాయి. ఈ మూడు పథకాల ప్రత్యేకతలు, లాభాలు తెలుసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకోవచ్చు.
పీపీఎఫ్ (PPF)..
పీపీఎఫ్ ఒక ప్రజాదరణ పొందిన ప్రభుత్వ మద్దతు కలిగిన దీర్ఘకాలిక సేవింగ్స్ స్కీమ్. ఇది గ్యారంటీతో కూడిన పన్ను రహిత రాబడులను అందిస్తుంది. ఈ పథకానికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపు లభించడమే కాకుండా మెచ్యూరిటీ మొత్తం, వడ్డీ రెండూ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి. అవసరమైతే ఈ స్కీమ్‌ను ఐదేళ్ల బ్లాకుల రూపంలో పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా ఇందులో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 30 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఏడాదికి రూ.1.50 లక్షలను పెడితే కాలవ్యవధిలో మొత్తం పెట్టుబడి రూ.45 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ రూ.1.09 కోట్లు లభిస్తాయి. మొత్తం మెచూరిటీ విలువ రూ.1.54 కోట్లు అవుతుంది.
ఈపీఎఫ్ (EPF)..
ఈపీఎఫ్ భారతీయ ఉద్యోగుల కోసం తప్పనిసరి రిటైర్మెంట్ సేవింగ్స్ పథకం. దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం కాంట్రిబ్యూషన్ రూపంలో జమ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.25 శాతం రాబడి లభిస్తోంది. నిర్దిష్ట సేవా కాలం పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తం పన్ను రహితంగా మారుతుంది. ఈ స్కీమ్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF). దీని ద్వారా ఉద్యోగి తప్పనిసరి 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని స్వచ్ఛందంగా జమ చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.50వేల నెలవారీ బేసిక్ జీతం అనుకుంటే, కాలవ్యవధిని 30 సంవత్సరాలుగా లెక్క వేస్తే, వార్షిక జీతం పెరుగుదల 5 శాతం అయితే ప్రస్తుతం రాబడిని 8.25 శాతం ఇస్తున్నారు. దీంతో 60 ఏళ్ల వయస్సులో.. అంటే రిటైర్మెంట్ ఏజ్‌లో మొత్తం కార్పస్ రూ.2.60 కోట్లు చేతిలో ఉంటుంది.

ఎన్‌పీఎస్ (NPS)..
ఎన్‌పీఎస్ ఒక స్వచ్ఛంద, మార్కెట్‌కు అనుసంధానమైన రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయులు ఇందులో చేరవచ్చు. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు వరకు రిటైర్మెంట్ కార్పస్ నిర్మించుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత మొత్తం కార్పస్‌లో 60 శాతం ట్యాక్స్ ఫ్రీగా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయాలి. అదే ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం అందిస్తుంది. ఇందులో నెలవారీ పెట్టుబడి రూ.12,500 పెడితే, ఏడాదికి 10 శాతం రాబడి అంచనా వేస్తే, కాల వ్యవధి 30 ఏళ్లు అనుకుంటే, 60 ఏళ్ల వయస్సులో రిటైర్ అయితే 40 శాతం యాన్యుటీ కొనుగోలు అనంతరం దానిపై ఏడాదికి 8 శాతం మేర రాబడి లభిస్తుంది. అంటే మొత్తం పెన్షన్ వెల్త్ రూ.2,84,91,567 అవుతుంది. పెట్టుబడి రూ.45 లక్షలు కాగా ట్యాక్స్ ఫ్రీ లంప్‌సమ్ ఉపసంహరణ రూ.1,70,94,940 లభిస్తుంది. యాన్యుటీ విలువ రూ.1,13,96,627 అవుతుంది. నెలవారీ పెన్షన్ సుమారు రూ.56వేలు లభిస్తుంది.
భిన్నంగా ఫలితాలు..
దీర్ఘకాలంలో ఈ మూడు పథకాల ఫలితాలు భిన్నంగా ఉంటాయని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పీపీఎఫ్ తక్కువ రాబడి ఇచ్చినా గ్యారంటీ, ప్రభుత్వ భరోసా ఉంటుంది. ఈపీఎఫ్ కూడా అదే తరహాలో పనిచేస్తూ కొంచెం ఎక్కువ రాబడి అందిస్తుంది. ఎన్‌పీఎస్ మాత్రం మార్కెట్‌కు అనుసంధానమై ఉండటంతో అత్యధిక కార్పస్ సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది. అందుకే ఫైనాన్షియల్ నిపుణులు ఒకే పథకంపై ఆధారపడకుండా విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని సూచింటారు. దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని, షార్ట్ టర్మ్ లాభాల కంటే స్థిరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. పోర్ట్‌ఫోలియోను సమర్థంగా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






