త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NPS | ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. ఇక రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం పొంద‌వ‌చ్చు..

NPS | రిటైర్మెంట్ తర్వాత ఆదాయం నిర్వహణను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్స్ (ఆర్‌ఐఎస్), డ్రాడౌన్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ కార్పస్ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా, దశలవారీగా డబ్బు పొందే అవకాశం ల‌భిస్తుంది.

S

Business | Published On May 19, 2026, 3.03 pm IST

NPS | ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. ఇక రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం పొంద‌వ‌చ్చు..
Advertisement

NPS | రిటైర్మెంట్ తర్వాత ఆదాయం నిర్వహణను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్స్ (ఆర్‌ఐఎస్), డ్రాడౌన్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ కార్పస్ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా, దశలవారీగా డబ్బు పొందే అవకాశం ల‌భిస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సర్క్యులర్‌లో పీఎఫ్‌ఆర్డీఏ ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ విధానం ద్వారా పెన్షన్ కార్పస్‌లోని లంప్‌సమ్ మొత్తంపై మార్కెట్ ఆధారిత వృద్ధి కొనసాగుతూనే, నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక చెల్లింపుల రూపంలో ఆదాయం పొందేందుకు వీలుంటుంది.

రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్ అంటే..

పీఎఫ్‌ఆర్డీఏ తెలిపిన ప్రకారం ఎన్‌పీఎస్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన పే-అవుట్ ఆధారిత లైఫ్ సైకిల్ ఆప్షన్‌ను రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్ (ఆర్‌ఐఎస్)గా పిలుస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా సబ్‌స్క్రైబర్లు తమ పెన్షన్ సేవింగ్స్‌లో కొంత భాగాన్ని డ్రాడౌన్ విధానంలో దశలవారీగా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రస్తుత అన్యుటీ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పటిలాగే కనీసం 20 లేదా 40 శాతం కార్పస్‌ను జీవితకాల పెన్షన్ కోసం అన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాల్సిందేనని పీఎఫ్‌ఆర్డీఏ స్పష్టం చేసింది. డ్రాడౌన్ ఉపసంహరణలు తప్పనిసరి అన్యుటైజేషన్ నిబంధనలపై ఎలాంటి ప్రభావం చూపవ‌ని, జీవితకాల పెన్షన్‌కు అవసరమైన కనీస చట్టబద్ధ రక్షణ అలాగే కొనసాగుతుంద‌ని సర్క్యులర్‌లో పేర్కొంది. కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద సబ్‌స్క్రైబర్లు తమ లంప్‌సమ్ కార్పస్ నుంచి రెండు విధానాల ద్వారా రెగ్యులర్ ఉపసంహరణలు చేసుకోవచ్చు. సిస్టమాటిక్ పే అవుట్ రేట్ (ఎస్‌పీఆర్), సిస్టమాటిక్ యూనిట్ రిడెంప్షన్ (ఎస్‌యూఆర్) విధానాల్లో న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. పెన్షన్ అకౌంట్‌ను క్లోజ్ చేసే సమయంలో, అంటే కొత్త కాంట్రిబ్యూషన్లు నిలిచిపోయే సమయంలో ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

ఈ సదుపాయం ప్రభుత్వ ఉద్యోగులు, నాన్ గవర్నమెంట్ సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులో ఉంది. రిటైర్ అయ్యే సమయంలో ఎంచుకున్న ప్లాన్ ప్రకారం 85 ఏళ్ల వయస్సు వరకు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక చెల్లింపులు పొందవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పెన్షన్ ఫండ్ మేనేజర్‌తోనే కొనసాగవచ్చు. అవసరమైతే రెండు ఆర్థిక సంవత్సరాలకు ఒకసారి ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఎస్‌పీఆర్ విధానం ఇలా..

ఎస్‌పీఆర్ మెకానిజం కింద సబ్‌స్క్రైబర్ వయస్సు, ఎంపిక చేసిన డ్రాడౌన్ వ్యవధి ఆధారంగా చెల్లింపులు లెక్కిస్తారు. ప్రతి సంవత్సరం సబ్‌స్క్రైబర్ పుట్టినరోజు తేదీకి మార్కెట్ విలువ ఆధారంగా పే అవుట్ రేట్ ను సవరిస్తారు. ఉదాహరణకు, 60 ఏళ్ల వయస్సులో ఎన్‌పీఎస్ నుంచి బయటకు వచ్చి 85 ఏళ్ల వరకు చెల్లింపులు కోరుకుంటే ప్రారంభంలో 4 శాతం పే అవుట్ రేట్ ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ శాతం కూడా పెరుగుతుంది. ఎస్‌యూఆర్ లేదా ఈక్వల్ యూనిట్స్ విధానంలో మొత్తం యూనిట్లను సమాన భాగాలుగా విభజించి ప్రతి నెలా రిడీమ్ చేస్తారు. ఉదాహరణకు, రూ.80 లక్షల కార్పస్ ఉన్న ఒక సబ్‌స్క్రైబర్‌కు ఎన్‌ఏవీ రూ.10గా ఉంటే, 25 ఏళ్ల పాటు నెలవారీ చెల్లింపులను ఎంచుకుంటే ప్రతి నెలా సుమారు 2,666.67 యూనిట్లు రిడీమ్ అవుతాయి.

రిటైర్డ్ ఉద్యోగులకు లాభం ఏంటి..?

రిటైర్మెంట్ తర్వాత చాలామంది ఒకేసారి డబ్బు ఖర్చు చేసి సేవింగ్స్ త్వరగా ఖాళీ చేసుకుంటున్నారని, మరికొందరు తక్కువ రాబడులు ఇచ్చే సంప్రదాయ అన్యుటీల్లో అధిక మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నారని పాలసీ మేకర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పస్‌లో కొంత భాగాన్ని మార్కెట్‌కు అనుసంధానంగా ఉంచుతూ, దశలవారీ ఉపసంహరణలను అనుమతించడం ద్వారా మరింత ఫ్లెక్సిబుల్ రిటైర్మెంట్ ఆదాయ మోడల్‌ను అందించాలని పీఎఫ్‌ఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానం వల్ల రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. మార్కెట్ వృద్ధి ద్వారా కొనుగోలు శక్తిని కొంతవరకు కాపాడుకోవచ్చు. సేవింగ్స్ త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే మార్కెట్‌కు అనుసంధానమైన పెట్టుబడులు కొనసాగుతుండటంతో, మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం పెన్షన్ చెల్లింపులపై ఉండే అవకాశం కూడా ఉంటుంది. సబ్‌స్క్రైబర్లు తమకు కావాలంటే 85 ఏళ్ల వరకు లేదా దానికంటే తక్కువ వయస్సు వరకు ఈ స్కీమ్‌ను కొనసాగించవచ్చు.

Advertisement
Advertisement