Electric Vehicles | ఎలక్ట్రిక్ వాహనాలను కొంటే పన్ను మినహాయింపు పొందవచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Electric Vehicles | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశంలో రోజు రోజుకీ ఇంధన ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా మైలేజీకి చాలా తక్కువ మొత్తంలో ఖర్చవుతుంది, పైగా మెయింటెనెన్స్ తక్కువ అన్న కారణాలతో వాహనదారులు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు.
Electric Vehicles | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశంలో రోజు రోజుకీ ఇంధన ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా మైలేజీకి చాలా తక్కువ మొత్తంలో ఖర్చవుతుంది, పైగా మెయింటెనెన్స్ తక్కువ అన్న కారణాలతో వాహనదారులు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆయా ఇంధన వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్త ఎక్కువే ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అయితే ఈవీలను కొనే విషయంలో సహజంగానే చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ఈవీని లోన్ తో కొంతే ఆదాయపు పన్ను మినహాయింపులు వస్తాయా, ఒక వేళ వస్తే నియమాలు ఎలా ఉంటాయి అన్న విషయాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండడం లేదు. అయితే వాస్తవానికి ఈవీని కొన్నప్పుడు సెక్షన్ 80ఇఇబి కింద లభించే పన్ను ప్రయోజనాల వెనుక సాధరాణంగా కొన్ని నియమాలు ఉంటాయి. అందువల్ల వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో సమస్యలు వస్తాయి.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకే..
చాలా మంది ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అంటేనే అన్ని రూల్స్ వర్తిస్తాయని భావిస్తారు. కానీ అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఈవీలపై వడ్డీ మినహాయింపు కేవలం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), భాగస్వామ్య సంస్థలు (పార్ట్‌నర్ షిప్ ఫర్మ్‌లు) లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయలేరు. అలాగే లోన్ కేవలం గుర్తింపు పొందిన బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ నుంచి మాత్రమే తీసుకుని ఉండాలి. ప్రైవేటు వ్యక్తులు లేదా బంధువుల దగ్గర అప్పు తీసుకుని ఈవీ కొంటే రాయితీలను ఇవ్వరు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు మాత్రమే వడ్డీ చెల్లింపులపై మినహాయింపును ఇస్తారు. ఈ సెక్షన్ కింద లభించే రాయితీని ఒకసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. ఒకటి కన్నా ఎక్కువ ఈవీలను కొంటే అన్నింటికీ ఒకేసారి క్లెయిమ్ చేయలేరు. ఇక కేవలం పాత పన్ను విధానాన్ని ఎంచుకుని రిటర్న్స్ దాఖలు చేసే వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
వ్యాపారులు, స్వయం ఉపాధి చేసేవారు అయితే..
2023 తరువాత ఈవీపై లోన్ తీసుకున్న వారికి ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక నిర్దిష్ట గడువును ఇచ్చింది. ఈవీ లోన్ ను కచ్చితంగా 2019 జనవరి 1 నుంచి 2023 మార్చి 31 మధ్య మాత్రమే తీసుకుని ఉండాలి. ఆ గడువు దాటిన తరువాత తీసుకున్న లోన్లకు ప్రస్తుతం ఈ సెక్షన్‌ను వర్తింపజేయడం లేదు. వ్యాపారులు లేదా స్వయం ఉపాధి వ్యక్తులకు మాత్రం ఒక ప్రత్యామ్నాయం కల్పించారు. వారు తమ వాహనాన్ని వ్యాపార అవసరాలకు వాడుతున్నట్లు చూపిస్తే లోన్ వడ్డీని బిజినెస్ ఖర్చుల కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలను కొన్నా కూడా పన్ను ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ అది కేవలం వ్యాపార అవసరాలకు వాడే వాహనాలకే వర్తిస్తుంది. కారును ఆఫీస్, వ్యక్తిగత అవసరాలు రెండింటికీ వాడితే, కేవలం ఆఫీస్ కోసం వాడిన శాతానికి (ఉదాహరణకు 60:40 నిష్పత్తిలో) మాత్రమే పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఫ్యుయల్ బిల్స్, మెయింటెనెన్స్ రికార్డులను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా కారుపై తరుగుదల, నిర్వహణ ఖర్చులను చూపించి పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
సంబంధిత వార్తలు

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
ఆగస్టు 7, 2026

Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్‌గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..
జులై 31, 2026

Flipkart Pay Later | అకౌంట్లో డబ్బులు లేకున్నా ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను కొనవచ్చు.. పే లేటర్ సర్వీస్ లాంచ్..
జులై 30, 2026
తాజావార్తలు
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
- ●Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ
- ●TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
- ●Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్‌తో శ్రీలీల ఫైట్ - ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?
- ●Neha Bora | నేహా బోరాపై ఇంకుతో దాడి.. దేశ వ్యతిరేకి అంటూ నినాదాలు

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ

TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం



