Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
Supreme Court | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Supreme Court | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణకు హాజరైతే నిరసనకారులు తనపై గుడ్లు విసిరే అవకాశం ఉందంటూ మినహాయింపు కోరడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మహువా మొయిత్రా పిటిషన్‌ను విచారించింది.
ఈ సందర్భంగా ఆమె తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, గతంలో ఆమె పర్యటనల సందర్భంగా నిరసనకారుల నుంచి గుడ్లు విసిరిన ఘటనలు చోటుచేసుకున్నాయని కోర్టుకు వివరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యక్ష హాజరు బదులుగా ఆన్‌లైన్ ద్వారా విచారణకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఈ వాదనలపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజా జీవితంలో ఉన్న వారు ఇలాంటి కారణాలను చూపుతూ చట్టపరమైన ప్రక్రియ నుంచి తప్పించుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ‘‘మీరు ఒక ఎంపీ. ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. గుడ్లు విసురుతారనే భయంతో విచారణకు రాకపోవడం సమంజసం కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు ఎన్నో కష్టాలను, ప్రమాదాలను ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి అంశాలతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తగదని కోర్టు అభిప్రాయపడింది. ధర్మాసనం వ్యాఖ్యలతో మహువా మొయిత్రా తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ





