Income Tax Return | ఐటీఆర్ గడువును పెంచారా..? ట్యాక్స్ పేయర్లకు కొత్త గడువు తేదీ..?
Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో చివరి తేదీకి ముందే ఐటీఆర్ ఫైల్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు.
Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో చివరి తేదీకి ముందే ఐటీఆర్ ఫైల్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆమె సూచించారు. కేంద్ర విధానం నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండాలని, నిజమైన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం వారికి ఇవ్వాలని, అయితే ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
3.2 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు..
పన్ను చట్టం ద్వారా అధికారులకు ఇచ్చిన అధికారాలను ఎల్లప్పుడూ వినయంతో వినియోగించాలని ఆమె సూచించారు. పన్ను చెల్లింపుదారుడు కేవలం పన్ను అంచనాకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదని, దేశ పౌరుడిగానూ, దేశాభివృద్ధిలో భాగస్వామిగానూ చూడాలని అన్నారు. అలాగే పన్ను వివాదాలను తగ్గించి, పన్ను వ్యవస్థలో స్పష్టతను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ప్రస్తుత ఐటీఆర్ దాఖలు సీజన్‌లో జూలై 21 నాటికి 3.2 కోట్లకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. వీటిలో సుమారు 94 శాతం రిటర్న్‌లు వెరిఫై కాగా, 60 శాతం రిటర్నులను ప్రాసెస్ చేశారు. అదేవిధంగా 1.3 కోట్లకు పైగా ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. వాటిలో 96 శాతం వెరిఫికేషన్ పూర్తికాగా, 40 శాతం రీఫండ్‌లను ప్రాసెస్ చేశారు. రీఫండ్ ప్రక్రియ వేగంగా పూర్తికావడం వల్ల పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసం పెరగడంతోపాటు వారి నగదు ప్రవాహం కూడా మెరుగుపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
గడువును పెంచారా..?
ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గిందన్నారు. తరచూ వస్తున్న సమస్యలకు మూల కారణాలను గుర్తించి ముందుగానే పరిష్కరించే దిశగా శాఖ పనిచేస్తోందని చెప్పారు. కాగా చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పెన్షనర్లు, ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వారికి ఐటీఆర్ దాఖలు గడువు సాధారణంగా జూలై 31గా ఉంది. అయితే అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించిన ఐటీఆర్-4 పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ హెల్ప్ పేజీలో ఆగస్టు 31ను గడువుగా చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా జూలై 31 వరకు గడువును పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేదా సర్క్యులర్ విడుదల కాలేదు.
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం






