ITR | ఐటీఆర్ ఫైల్ చేశారా ? ఈ పని చేయకపోతే రిటర్న్ చెల్లదు..
ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం మాత్రమే పన్ను ప్రక్రియలో చివరి దశ కాదు. రిటర్న్‌ను పూర్తి చేయాలంటే నిర్దేశిత గడువులోపు తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ ను పూర్తి చేయాలి. ఈ-వెరిఫికేషన్ చేయకపోతే ఎంత కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేసినా కూడా ఆదాయపు పన్ను శాఖ దానిని చెల్లని రిటర్న్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది.
ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం మాత్రమే పన్ను ప్రక్రియలో చివరి దశ కాదు. రిటర్న్‌ను పూర్తి చేయాలంటే నిర్దేశిత గడువులోపు తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ ను పూర్తి చేయాలి. ఈ-వెరిఫికేషన్ చేయకపోతే ఎంత కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేసినా కూడా ఆదాయపు పన్ను శాఖ దానిని చెల్లని రిటర్న్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. దీంతో రిఫండ్ ఆలస్యం కావడం, జరిమానాలు పడడం, ఇతర పన్ను సంబంధిత సమస్యలు ఎదురుకావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ-వెరిఫికేషన్ గడువు, అందుబాటులో ఉన్న విధానాలు, పూర్తి ప్రక్రియ గురించి నిపుణులు వివరాలను వెల్లడిస్తున్నారు. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 కాగా పన్ను చెల్లింపుదారులు తమ పాన్, పాస్‌వర్డ్‌తో ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి రిటర్న్ దాఖలు చేయవచ్చు. తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నవారు పాన్, ఆధార్ తదితర అవసరమైన వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి.
ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి..
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్ దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో సాంకేతిక సమస్యలు లేదా ఫైలింగ్ సమయంలో పొరపాట్లను నివారించవచ్చు. ఐటీఆర్ దాఖలు చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తికాదు. రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. నిర్దేశిత గడువులోపు ఈ-వెరిఫికేషన్ చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ను అసంపూర్తిగా లేదా చెల్లనిదిగా పరిగణించే అవకాశం ఉంటుంది. దీంతో రిటర్న్ ప్రాసెసింగ్ ఆలస్యం కావడంతోపాటు రావాల్సిన రిఫండ్ కూడా ఆలస్యమవుతుంది. ఈ-వెరిఫికేషన్ స్థితిని ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఐటీఆర్-వి విభాగం ద్వారా పరిశీలించవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ-వెరిఫికేషన్ చేయాలంటే ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అక్కడ ఈ-వెరిఫై రిటర్న్ పై క్లిక్ చేయాలి. అనంతరం పాన్, అసెస్‌మెంట్ ఇయర్, అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ నమోదు చేయాలి. లేదా పాన్, పాస్‌వర్డ్‌తో నేరుగా లాగిన్ అయి మై అకౌంట్ విభాగంలో ఈ-వెరిఫై రిటర్న్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఎలా చేయాలి..
వెరిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న రిటర్న్‌లు పోర్టల్‌లో కనిపిస్తాయి. అందులో ఈ-వెరిఫైపై క్లిక్ చేస్తే మూడు విధానాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ఉపయోగించడం, కొత్త ఈవీసీ రూపొందించి దాంతో వెరిఫికేషన్ పూర్తి చేయడం లేదా ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయడం వంటి ఆప్షన్‌లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ ను ఇస్తారు. అదే సమయంలో దాని సమాచారం కూడా అందుతుంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌తోపాటు నెట్ బ్యాంకింగ్‌లోని ఈ-వెరిఫై ఐటీఆర్ సదుపాయం ద్వారా కూడా వెరిఫికేషన్ చేయవచ్చు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా, బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఆధారంగా రూపొందే ఈవీసీ ద్వారా, అలాగే ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల ఏటీఎంల ద్వారా కూడా ఈవీసీ రూపొందించి వెరిఫికేషన్ ను పూర్తి చేయవచ్చు.
ఈ-వెరిఫికేషన్ పూర్తయితే..
పన్ను చెల్లింపుదారుడి తరఫున అధీకృత సంతకదారు లేదా ప్రతినిధి కూడా ఈ-వెరిఫికేషన్ ను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ఈవీసీ, బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఈవీసీ వంటి అధికారికంగా అనుమతించిన పద్ధతులను ఉపయోగించవచ్చు. ఈ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయితే స్క్రీన్‌పై ధ్రువీకరణ సందేశంతోపాటు ట్రాన్సాక్షన్ ఐడీ కనిపిస్తుంది. అలాగే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఈ-మెయిల్‌కు కన్‌ఫర్మేషన్ ఈ-మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ అధీకృత సంతకదారు లేదా ప్రతినిధి ద్వారా వెరిఫికేషన్ జరిగితే కూడా ట్రాన్సాక్షన్ ఐడీ కలిగిన విజయవంతమైన సందేశం కనిపిస్తుంది. అనంతరం అధీకృత ప్రతినిధి నమోదిత ఈ-మెయిల్‌కు, అలాగే పన్ను చెల్లింపుదారుడి నమోదిత ఈ-మెయిల్‌కు నిర్ధారణ సందేశం (కన్ఫర్మేషన్ మెసేజ్) అందుతుంది.
గడువు మిస్ అయితే..
నిర్దేశిత గడువులోపు ఈ-వెరిఫికేషన్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆ ఐటీఆర్ ను దాఖలు చేయనట్టుగానే పరిగణిస్తారు. అంటే ఐటీఆర్ అసలు దాఖలు చేయని వారికి అమలు చేసే నియమాలనే కొనసాగిస్తారు. అయితే గడువు మిస్ అయిన పన్ను చెల్లింపుదారులు ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ కండొనేషన్ ఆఫ్ డిలే అభ్యర్థన సమర్పించవచ్చు. ఆ అభ్యర్థన దాఖలు చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. అయితే ఆదాయపు పన్ను శాఖ ఆ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ రిటర్న్ చెల్లుబాటు అవుతుంది.
సంబంధిత వార్తలు

Income Tax Return | ఐటీఆర్ గడువును పెంచారా..? ట్యాక్స్ పేయర్లకు కొత్త గడువు తేదీ..?
జులై 25, 2026

ITR | స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఐటీఆర్‌లో వివరాలను నమోదు చేయాలా.. తెలుసుకోవాల్సిన విషయాలు..
జులై 22, 2026

ITR | ఎఫ్‌డీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలా.. ఐటీఆర్‌లో ఎలా నమోదు చేయాలి..?
జులై 20, 2026
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు




