త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPOs In 2026 | ఐపీవోల‌లో పెట్టుబ‌డి పెడుతున్నారా..? అయితే 2026లో పండగే..!

IPOs In 2026 | భార‌త స్టాక్ మార్కెట్‌ల‌లో గ‌త ఏడాది కాలం నుంచి అనిశ్చితి కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. గ‌తేడాది మార్కెట్లు ఉన్న స్థితిలోనే ఇప్పుడు కూడా ఉన్నాయి. అస‌లు మార్కెట్లు ఎక్క‌డికీ క‌ద‌ల‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఐపీవోల‌కు మాత్రం డిమాండ్ విప‌రీతంగా పెరిగింది. చాలా వ‌ర‌కు ఐపీవోల‌లో ఎస్ఎంఈలే ఉంటున్నాయి.

S

Business | Published On Dec 25, 2025, 3.24 pm IST

IPOs In 2026 | ఐపీవోల‌లో పెట్టుబ‌డి పెడుతున్నారా..? అయితే 2026లో పండగే..!
Advertisement

IPOs In 2026 | భార‌త స్టాక్ మార్కెట్‌ల‌లో గ‌త ఏడాది కాలం నుంచి అనిశ్చితి కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. గ‌తేడాది మార్కెట్లు ఉన్న స్థితిలోనే ఇప్పుడు కూడా ఉన్నాయి. అస‌లు మార్కెట్లు ఎక్క‌డికీ క‌ద‌ల‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఐపీవోల‌కు మాత్రం డిమాండ్ విప‌రీతంగా పెరిగింది. చాలా వ‌ర‌కు ఐపీవోల‌లో ఎస్ఎంఈలే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కూడా ఐపీవోల‌లో డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక అంత‌కు ముందు రెండు సంవ‌త్స‌రాల‌తో పోలిస్తే 2025లో ఐపీవోల‌లో పెట్టుబ‌డులు బాగానే పెరిగాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. 2023లో మొత్తం లిస్టింగ్ అయిన ఐపీవోల సంఖ్య 240 ఉండ‌గా 2024లో అది పెరిగి 332కు చేరింది. ఇక ఈ ఏడాది మొత్తం లిస్టింగ్ అయిన ఐపీవోల సంఖ్య 371గా ఉంది. ఈ క్ర‌మంలోనే ఐపీవోల ద్వారా ఈ ఏడాదిలో ఏకంగా రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు వ‌చ్చాయ‌ని గ‌ణాంకాల ద్వారా తేలింది.

ప‌లు ప్ర‌ముఖ కంపెనీల లిస్టింగ్‌..

ఇక 2026లోనూ ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు ఐపీవోల ద్వారా లిస్టింగ్‌కు రానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇన్వెస్ట‌ర్ల‌కు 2026 మంచి లాభాల‌ను అందిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2026లో ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు ఐపీవోల‌ను లిస్ట్ చేయ‌నున్నాయి. వాటిల్లో భార‌త్ కుకింగ్ కోల్‌, రిల‌యన్స్ జియో, ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌పే, ఎన్ఎస్ఈ, జెప్టో, ఎస్‌బీఐ మ్యుచువ‌ల్ ఫండ్‌, ఓయో, బోట్‌, హీరో ఫిన్‌కార్ప్‌, ఫ్రాక్ట‌ల్ అన‌లిటిక్స్‌, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎన‌ర్జీ, ప్రెస్టిజ్ హాస్పిటాలిటీ వంటి కంపెనీలు ఉండ‌డం విశేషం. ఇక ఈ ఐపీవోల కోసం ఇన్వెస్ట‌ర్లు, ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రానున్న ఏడాది కాలంలో ఐపీవోల సంఖ్య మరింత పెరుగుతుంద‌ని, పెట్టుబ‌డులు కూడా ఈ ఏడాది క‌న్నా భారీగానే వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

రిల‌య‌న్స్ జియో ముందు వ‌రుస‌లో..

వ‌చ్చే ఏడాది లిస్టింగ్ అవ‌నున్న రిల‌య‌న్స్ జియో ఆ జాబితాలో ముందు వ‌రుసలో నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఐపీవో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియో టెలికాం రంగానికి చెందిన కంపెనీ. ఈ ఏడాది లిస్ట్ అవ‌నున్న అత్యంత భారీ ఐపీవో ఇదే అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జియోకు పోటీగా ఉన్న భార‌తీ ఎయిర్‌టెల్ విలువ 140 బిలియ‌న్ డాల‌ర్లు ఉండ‌గా, జియో విలువ 170 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో జియో షేర్ల ధ‌ర‌లు భారీగా పెరుగుతాయ‌ని, షేర్ విలువ ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. దీని వ‌ల్ల ఈ ఐపీవోకు భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు.

ఇక ఈ-కామ‌ర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ సారి ఐపీవోకు రాబోతోంది. ఈ కంపెనీ విలువ 60 నుంచి 70 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఫ్లిప్ కార్ట్ వ‌చ్చే ఏడాది రానున్న ఐపీవోల‌లో రెండో అతి పెద్ద ఐపీవో అవుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. అలాగే ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా భార‌త్ కుకింగ్ కోల్ లిమిటెడ్‌, ఎన్ఎస్ఈ, ఫోన్‌పే, జెప్టో వంటి సంస్థ‌లు నిలిచాయి. దీంతో వ‌చ్చే ఏడాది ఈ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక 2026 సంవ‌త్స‌రం ఐపీవో పెట్టుబ‌డిదారుల‌కు పండ‌గే అని అంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement