IndiGo | ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా విలియమ్ వాల్ష్..!
IndiGo | దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ బోర్డు మంగళవారం విలియమ్ వాల్స్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు.
IndiGo | దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ బోర్డు మంగళవారం విలియమ్ వాల్స్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం జూలై 31తో ముగియనుంది. ఆగస్టు 3లోగా ఇండిగో సీఈఓవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్లోబల్ ఎవియేషన్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన వారిలో వాల్ష్ ఒకరు. ఇండిగో కీలక దశలో సీఈవో మార్పు జరుగుతుండడం విశేషం. ఓ వైపు అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలు కొనసాగుతుండగా.. మరో వైపు ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలతో ఒత్తిడి పెరుగుతున్న తరుణంలోనే వాల్ష్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
విలియమ్ వాల్ష్ ఎవరు?
విలియమ్ వాల్ష్ పైలట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఐర్లాండ్‌కు చెందిన ఎయిర్ లింగస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, అనంతరం 2000 నుంచి 2005 వరకు సీఈఓగా సేవలందించారు. ఈ కాలంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ ఎయిర్‌లైన్‌ను లాభాలబాటలో నడిపించడంతో పాటు ఖర్చులు తగ్గించడంలో కీలకపాత్ర పోషించారు. 2005లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో సంస్థను సమర్థంగా నడిపించడమే కాకుండా, కార్మిక సంఘాలతో కఠిన చర్చలు జరిపి సంస్థను గట్టెక్కించారు. 2011లో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ (ఐఏజీ) సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వాల్ష్.. 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎయిర్ లింగస్, ఐబీరియా, లెవెల్, వ్యూలింగ్ వంటి ఎయిర్‌లైన్స్‌ను కలిగి ఉన్న ఈ గ్రూప్‌ను విజయవంతంగా ముందుకు నడిపించారు. 2021 నుంచి ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయన.. విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాలు, విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, నియంత్రణ సంస్థలతో చర్చల్లో పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇండిగో ఏమన్నదంటే..?
ఇండిగో చైర్మన్ విక్రం సింగ్ మెహతా మాట్లాడుతూ వాల్ష్ నియామకంపై స్పందించారు. ఆయనకు ఉన్న విస్తృత అనుభవం, సంక్లిష్ట మార్కెట్ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాలు ఉన్నాయన్నారు. ఇండిగో భవిష్యత్ వృద్ధికి ఆయన నాయకత్వం కీలకమని పేర్కొన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా మాట్లాడుతూ గ్లోబల్ దృష్టికోణంలో ఆపరేషనల్ నైపుణ్యం, వినియోగదారులకు కేంద్రంగా ఉన్న సేవల నిర్మాణంలో అనుభవం వాల్ష్‌కు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత కీలక దశలో ఇండిగోను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన సరైన వ్యక్తని అభిప్రాయపడ్డారు. ఇక వాల్ష్ మాట్లాడుతూ ఇండిగోకు సీఈవో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ సిబ్బంది అంకితభావం, ప్రొఫెషనలిజం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. విమానయాన రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పుల్లో ఇండిగో ముందంజలో ఉండే సామర్థ్యం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఇండిగో కంపెనీ 400పైగా విమానాలు, రోజుకు సుమారు 2,200 విమాన సర్వీసులు, 95పైగా దేశీయ, 40పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలు కలిగి ఉంది. 2025లో 12.4 కోట్ల ప్రయాణికులకు సేవలందించింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్ 2025లో భారత్, దక్షిణాసియాలో బెస్ట్ ఎయిర్‌లైన్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






