Venezuelan oil | చమురు కొనుగోళ్లలో వ్యూహం మార్చిన భారత్.. తొలిసారి వెనెజువెలా నుంచి దిగుమతి
Venezuelan oil | అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో చమురు కొనుగోళ్లలో భారత్ (India) తన వ్యూహాన్ని మార్చింది.
Venezuelan oil | అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో చమురు కొనుగోళ్లలో భారత్ (India) తన వ్యూహాన్ని మార్చింది. ఇందులో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తొలిసారిగా వెనెజువెలా నుంచి ముడిచమురు (Venezuelan oil) కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అంతేకాదు ప్రైవేటు సంస్థ హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (HPCL Mittal Energy Ltd) (HMEL) సైతం రెండేళ్ల విరామం తర్వాత వెనెజువెలా చమురు దిగుమతులు ప్రారంభించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఈ రెండు రిఫైనరీలు వెనెజువెలాకు చెందిన మేరీ క్రూడ్ గ్రేడ్‌లో చెరో 1 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయి. షిప్పింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రెండు ఆర్డర్లను ఒకే భారీ నౌక (వీఎల్ సీసీ) ద్వారా భారత్‌కు తరలించనున్నారు. కాగా, ఏప్రిల్ నాటికి వెనెజువెలా ముడి చమురు దిగుమతులను భారత్ కనీసం ఆరు మిలియన్ బ్యారెళ్లకు పెంచుతుందని సదరు వర్గాలు వివరించాయి. అయితే, దీనిపై రెండు సంస్థల నుంచి స్పందన రావాల్సిఉంది.
కాగా, ఇటీవలే భారత్-అమెరికా మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే రష్యా చమురు కొనుగోళ్లు కారణం చూపి విధించిన అదనపు సుంకాలను కూడా అప్పుడు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే దేశీయ ఇంధన అవసరాలను తీర్చడం కోసం ఇంధన కొనుగోళ్లలో భారత్ తన వ్యూహాన్ని మార్చినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. మరోవైపు వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అమెరికా నుంచి జనరల్ లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో రిలయన్స్ సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

OMC Shares | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎఫెక్ట్.. భారీగా పతనమైన ఓఎంసీల షేర్లు..
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



