Stock Markets | ముడి చమురు ధరల సెగ.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు వరుసగా పెరుగుతుండడంతో, ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. దీంతో మార్కెట్లపై ఒత్తిడి కొనసాగింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు వరుసగా పెరుగుతుండడంతో, ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. దీంతో మార్కెట్లపై ఒత్తిడి కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 242.65 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 64.05 పాయింట్లు కోల్పోయింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 72,529.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీ 22,716.20 వద్ద ముగిసింది. నిఫ్టీలో నష్టపోయిన ప్రధాన షేర్లలో టైటాన్ కంపెనీ, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
చివర్లో స్వల్ప ఊరట..
రంగాల వారీ సూచీలను పరిశీలిస్తే మెటల్, ఫార్మా రంగాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల సూచీలు 1.5 శాతం చొప్పున క్షీణించాయి. మిడ్‌క్యాప్ షేర్లపై కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.6 శాతం పడిపోగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.7 శాతం నష్టపోయింది. మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్ 2.49 శాతం తగ్గి 13.30 స్థాయికి చేరింది. ఇది మార్కెట్‌లో వోలాటిలిటీ తగ్గినట్లు సూచించింది. కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి మంగళవారం డాలర్‌తో పోలిస్తే దాదాపు స్థిరంగా ముగిసింది. ఒక డాలర్‌కు 95.98 రూపాయల వద్ద ముగిసిన రూపాయి, అంతకుముందు సెషన్‌లో కూడా ఇదే 95.98 స్థాయిలో ఉంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు మంగళవారం ఉదయం భారీగా పెరిగినా తరువాత తగ్గాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లకు ఊరట లభించింది. చివర్లో వచ్చిన బలమైన ర్యాలీతో సూచీలు ఇంట్రా డే గరిష్టాల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరల విషయానికి వస్తే బ్రెంట్ క్రూడ్ ధర 1.25 శాతం మేర పతనమై బ్యారెల్‌కు 96 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.37 శాతం తగ్గి బ్యారెల్‌కు 95 డాలర్లకు వచ్చింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
- ●OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..
- ●Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియనేస్తం - బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో - హోస్ట్‌గా హనుమాన్ హీరో
- ●UP Police Viral Video | రక్షణ కల్పించాల్సింది పోయి రికార్డింగ్స్ ఏంటి?: కాశీలో డ్యాన్సర్లను వీడియో తీసిన యూపీ పోలీసులు.. నెటిజన్లు ఫైర్
- ●HYDRAA | సున్నం చెరువు, తమ్మిడికుంట అభివృద్ధిపై హైడ్రా ఫోకస్
- ●Assam Rifles | అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు.. జవాను వీరమరణం

Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం

OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్‌ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..

Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియనేస్తం - బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో - హోస్ట్‌గా హనుమాన్ హీరో

UP Police Viral Video | రక్షణ కల్పించాల్సింది పోయి రికార్డింగ్స్ ఏంటి?: కాశీలో డ్యాన్సర్లను వీడియో తీసిన యూపీ పోలీసులు.. నెటిజన్లు ఫైర్






