త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన‌ స్టాక్ మార్కెట్లు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318.56 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 155.05 పాయింట్లు తగ్గింది. ఆటో, రియాల్టీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

S

Business | Published On Nov 13, 2026, 4.05 pm IST

Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన‌ స్టాక్ మార్కెట్లు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318.56 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 155.05 పాయింట్లు తగ్గింది. ఆటో, రియాల్టీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

భారత స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను కొనసాగించాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 318.56 పాయింట్లు తగ్గి 81,592.45 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 155.05 పాయింట్లు క్షీణించి 25,144.30 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 81,911.01 వద్ద, నిఫ్టీ 25,299.35 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

లాభాల్లో ఇంధ‌న‌, ఎఫ్ఎంసీజీ రంగాలు..

షేర్ల వారీగా చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, ఐషర్ మోటార్స్, ఓఎన్‌జీసీ, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా ఇంధన, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. ఆటో, రియాల్టీ, మెటల్ రంగాల సూచీలు ఒక్కొక్కటి సుమారు ఒక శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 0.3 శాతం చొప్పున తగ్గాయి.

చ‌మురు ధ‌ర‌ల్లో అస్థిర‌త‌..

మార్కెట్‌లో ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ 5.05 శాతం తగ్గి 15.78 స్థాయికి చేరింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత బలహీనపడింది. శుక్రవారం రూపాయి 94.24 వద్ద ముగిసింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.03గా నమోదైంది. అంత‌ర్జాతీయ స్థాయిలో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం స్టాక్ మార్కెట్ల లాభాల‌కు బ్రేక్ వేసింది. వ‌రుస సెష‌న్ల‌లో లాభాల్లో ఉన్న సూచీలు రెండు రోజులుగా అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇక ముడి చమురు ధ‌ర శుక్ర‌వారం ఉద‌యం భారీగా పెరిగిన‌ప్ప‌టికీ త‌రువాత ధ‌ర‌లు మ‌ళ్లీ తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.71 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.97 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 88 డాల‌ర్ల‌కు చేరింది.

Advertisement
Advertisement