IPO | రూ.36 కోట్ల ఎస్ఎంఈ ఐపీవో.. జూన్ 17న ఓపెన్.. పెట్టుబడి ఎంతంటే..
IPO | ఎస్ఎంఈ ఐపీవోలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల కోసం మరో కొత్త అవకాశంగా లియోటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీవో రానుంది. హార్డ్‌వేర్ స్ట్రక్చర్స్, డోర్ కిట్స్, హింజ్‌లు, గేట్ హుక్స్, ఆల్డ్రాప్స్, లాక్స్, హ్యాండిల్స్, టవర్ బోల్ట్స్, షెల్ఫ్ బ్రాకెట్ల వంటి ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ ఐపీవో జూన్ 17 నుంచి జూన్ 19 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండనుంది.
IPO | ఎస్ఎంఈ ఐపీవోలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల కోసం మరో కొత్త అవకాశంగా లియోటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీవో రానుంది. హార్డ్‌వేర్ స్ట్రక్చర్స్, డోర్ కిట్స్, హింజ్‌లు, గేట్ హుక్స్, ఆల్డ్రాప్స్, లాక్స్, హ్యాండిల్స్, టవర్ బోల్ట్స్, షెల్ఫ్ బ్రాకెట్ల వంటి ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ ఐపీవో జూన్ 17 నుంచి జూన్ 19 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.36.02 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ.321గా నిర్ణయించింది. ఈ ఐపీఓలో పాల్గొనాలనుకునే పెట్టుబడిదారులు కనీసం 400 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కనీస పెట్టుబడి మొత్తం రూ.2,56,800గా ఉంటుంది. కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 58వేల షేర్లను మార్కెట్ మేకర్‌కు విక్రయించి సుమారు రూ.2 కోట్లు, అలాగే 10.64 లక్షల షేర్లను ప్రజలకు విక్రయించి సుమారు రూ.34 కోట్లు సమీకరించనుంది.
వాటాలు ఇలా..
ఐపీఓ ద్వారా లభించే నిధులను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవసరాలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలు, కంపెనీపై ఉన్న రుణాల చెల్లింపుల కోసం వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఇష్యూకు కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించనుండగా, వెల్త్ మైన్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించనుంది. ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లకు 47.42 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) 47.42 శాతం, మార్కెట్ మేకర్లకు 5.17 శాతం వాటా కేటాయించారు. ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నవారికి షేర్లను జూన్ 22న అలాట్ చేస్తారు. ఖాతాదారుల డీమ్యాట్ అకౌంట్లలో జూన్ 23న షేర్లు క్రెడిట్ అవుతాయి. జూన్ 24న లిస్టింగ్ అవుతుంది. బీఎస్ఈ ఎస్ఎంఈలో ఈ స్టాక్ లిస్టింగ్ కానుంది.
ప్రస్తుతం లియోటెక్ ఇండస్ట్రీస్ ఐపీఓకు సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) వివరాలు అందుబాటులో లేవు. జీఎంపీలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు తాజా అప్‌డేట్స్‌ను గమనించడం మంచిది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
- ●Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు






