Stock Markets | యుద్ధం ఆందోళనలతో.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్‌లోనూ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, అమెరికాలో వడ్డీ రేట్లు మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగే అవకాశాలపై ఆందోళనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్‌లోనూ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, అమెరికాలో వడ్డీ రేట్లు మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగే అవకాశాలపై ఆందోళనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 719 పాయింట్లు పడిపోయి 73,524 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 73,318 కనిష్ట స్థాయిని తాకింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 244 పాయింట్లు క్షీణించి 23,123 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 23,070 స్థాయికి పడిపోయింది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి అన్ని విభాగాల్లో కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.92 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.40 శాతం నష్టపోయాయి. సెక్టార్‌ల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ అమ్మకాలతో కుదేలయ్యాయి. ఆరోగ్య రంగానికి చెందిన నిఫ్టీ హెల్త్‌కేర్ మాత్రమే లాభాల్లో నిలిచింది.
దీర్ఘకాలంలో ఎలా ఉండొచ్చు..?
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదరడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల వైపు పయనిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో గ్లోబల్ టెక్నాలజీ షేర్లలో కూడా అమ్మకాలు పెరిగాయని, ఏఐ ఆధారిత ర్యాలీ స్థిరత్వంపై పెట్టుబడిదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అమెరికాలో బలమైన ఉద్యోగ గణాంకాలు, ఇంకా తగ్గని ద్రవ్యోల్బణం కారణంగా ఫెడరల్ రిజర్వ్ మరింత కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంగా బాండ్ యీల్డ్స్, అమెరికన్ డాలర్ బలపడుతున్నాయని చెప్పారు. అయితే గ్లోబల్ టెక్ రంగంలో మరింత కరెక్షన్ కొనసాగితే భారత్ ఇతర మార్కెట్లతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన ఇవ్వొచ్చని, కానీ అధిక ముడి చమురు ధరలు, వడ్డీ రేట్ల అనిశ్చితి మార్కెట్ల పెరుగుదలకు అడ్డంకిగా మారుతాయని అభిప్రాయపడ్డారు.
కాగా బ్రెంట్ క్రూడ్ ధర 3.39 శాతం పెరిగి బ్యారెల్‌కు 96.24 డాలర్లకు చేరుకుంది. అమెరికా క్రూడ్ ధర 3.17 శాతం పెరిగి 93.41 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్చి నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ మళ్లీ పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 77 పైసలు తగ్గి 95.70 వద్ద నిలిచింది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు
జూన్ 8, 2026

Shares | మరో ప్రభుత్వ రంగ సంస్థలో షేర్లను విక్రయించనున్న కేంద్రం.. వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ అడుగులు..
జూన్ 6, 2026

Stock Markets | స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో సూచీలు..
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- ●Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?
- ●Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?
- ●DGP CV Anand | పోలీసింగ్‌లో సాంకేతికతకు పెద్దపీట : డీజీపీ సీవీ ఆనంద్
- ●YouTuber | యూట్యూబర్ కొంప ముంచిన హోమ్‌టూర్ వీడియో.. రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ

HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?

Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?



