Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?
Bandi Sanjay vs Etela Rajender | క్రమశిక్షణకు మారుపేరైన భారతీయ పార్టీలో ఆ క్రమశిక్షణ సడలిపోతున్నదా? పార్టీలో అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయా? ఒకరిని చూసి మరొకరు సహించుకోలేని స్థాయిలో శతృత్వాలు పోస్టర్ల రూపంలో బజారున పడుతున్నాయా? అంటే..అవుననే సమాధానమిస్తున్నాయి ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు.
ఈటలకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన
బండి సంజయ్ అనుచరుడు రామకృష్ణ
తక్షణం సస్పెండ్ చేసిన పార్టీ
మరో వివాదంలో కేంద్రమంత్రి బండి
పోక్సో కేసులోనూ హానీ ట్రాప్ జరిగిందంటూ
కుమారుడిని సమర్థించుకునే యత్నం
3 రోజులుగా ఫోన్ స్విచాఫ్
Bandi Sanjay vs Etela Rajender | త్రినేత్ర.న్యూస్ : క్రమశిక్షణకు మారుపేరైన భారతీయ పార్టీలో ఆ క్రమశిక్షణ సడలిపోతున్నదా? పార్టీలో అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయా? ఒకరిని చూసి మరొకరు సహించుకోలేని స్థాయిలో శతృత్వాలు పోస్టర్ల రూపంలో బజారున పడుతున్నాయా? అంటే..అవుననే సమాధానమిస్తున్నాయి ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు. అయితే ఈ ఘటన వెనక కేంద్రమంత్రి బండి సంజయ్ ఉన్నట్టు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనలో బండి అనుచరుడైన జన్యావుల రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడో రేపో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉనట్టు తెలుస్తున్నది.
ఈటలపై ఎవరికి కోపం..?
రాజకీయాల్లో వివాద రహితుడిగా, అజాత శత్రువుగా ఈటల రాజేందర్‌కు పేరుంది. బీఆర్ఎస్ నుంచి 2021లో బయటకు వచ్చిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తిరిగి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి 16873 ఓట్లతో ఓడిపోయాడు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి 3 లక్షలకు పైగా ఓట్లతో ఎంపీగా గెలుపొందారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసే విషయమై బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. అధిష్టానానికి వరుస ఫిర్యాదులు, వినతుల నేపథ్యంలో.. ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి చేయాల్సి వచ్చింది. 2021లోనే కరీంనగర్‌లో జరిగిన స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరుధ్యం పెరిగి పెద్దైంది.
సైకోగాడు.. చిల్లరగాడు...
2025లో ఈటల రాజేందర్ శామీర్‌పేటలోని తన స్వగృహంలో బండి సంజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. " అసలు నువ్వెవరు? నీ శక్తి ఎంత? నేను 2002లో జిల్లాకు వచ్చాను. మంత్రిగా పని చేశాను. నేను అడుగుపెట్టని గ్రామం లేదు. ఖబర్దార్ బిడ్డా " అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై అప్పట్లో బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కాగా ఈటల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన సమయంలో అది ఆయనకు దక్కుండా బండి సంజయ్ అడ్డుపడ్డాడని ఈటల వర్గం భావించింది. అంతేకాకుండా.. రాష్ట్ర పార్టీలో ఉన్న సీఎస్సార్ ఫండ్స్‌ను కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే వాడుకుంటున్నారని మిగతా నేతలు ఎవ్వరికీ రావడం లేదని ఈటల కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్గత విభేదాలను ధ్రువీకరిస్తున్నాయి.
2 నెలలుగా.. పోస్టర్లు
ఈటల రాజేందర్‌పై వాల్ పోస్టర్లు వెలవడం ఇదే మొదటి సారి కాదు. ఏప్రిల్ నెలలో కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటూ వాల్ పోస్టర్లను ముద్రించారు. ఈ ఏడాది జనవరి నెలలో కంటోన్మెంట్‌లోని బీజేపీ నేత రామకృష్ణ నామినేటెడ్ పోస్టుకు ఎంపికయ్యారు. మరుసటి నెలలోనే ఈటల రాజేందర్.. ఢిల్లీ వెళ్లి ఆ పదవివి కాస్తా తను అనచరుడి కుటుంబానికి ఇప్పించారు. ఇది కాస్తా రామకృష్ణకు ఆగ్రహం తెప్పించింది. బండి సంజయ్‌కు అనుచరుడిగా ఉన్న రామకృష్ణ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈటలకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయించారు. ఈ ఘటనలో రామకృష్ణ పీఏను మరో నలుగురిని అదుపులోకి తీసకున్నారు.
గత 3 రోజులుగా బండి సంజయ్ ఫోన్ స్విచాఫ్
ఇటీవల మైనర్ అమ్మాయపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడైన తన కుమారుడిని పోలీసులకు దొరక్కకుండా 10 రోజుల పాటు తాత్సారం చేసిన విషయంలో... పార్టీ సమాధానం చెప్పుకోలేక పోయింది. ఇప్పుడు.. తన అనుంగు సహచరుడితో ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ గత 3 రోజులుగా స్విచాఫ్ రావడం గమనార్హం.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 8, 2026

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
జూన్ 8, 2026

Bhatti Vikramarka | లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్
- ●Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
- ●Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష



