Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ – హీరోయిన్ ఎవరంటే?
అల్లు అర్జున్ మూవీతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియన్ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతోన్నాయి. బన్నీ మూవీ కంటే ముందు లోకేష్ కనగరాజ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాడట. ఇందులో హీరోయిన్ ఎవరంటే?
Entertainment | Published On Jun 8, 2026, 6.17 pm IST
Lokesh Kanagaraj | ఖైదీ, విక్రమ్, లియో బ్లాక్ల్‌బస్టర్స్‌తో కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా మారిపోయాడు లోకేష్ కనగరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌గా త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అల్లు అర్జున్‌తో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ మూవీ స్క్రిప్ట్ పనులతో ఈ డైరెక్టర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. బన్నీ మూవీ కంటే ముందే లోకేష్ కనగరాజ్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్‌గా కాకుండా కేవలం ప్రొడ్యూసర్‌గా మాత్రమే వ్యవహరించనున్నాడట.
మైత్రీ మూవీ మేకర్స్...
మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి తన నిర్మాణ సంస్థ జీ స్క్వాడ్ బ్యానర్‌లో లోకేష్ కనగరాజ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ నిర్మించబోతున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు యాక్టర్లు ఈ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్నాడట. గతంలో డైరెక్టర్‌గా బాంబ్, సిలా నెరంగలి సిలా మణితరగల్ అనే సినిమాలు చేశాడు విశాల్ వెంకట్. దర్శకుడిగా ఇది అతడి మూడో మూవీ. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీకి లోకేష్ కనగరాజ్ కథను అందించడమే కాకుండా ఇందులో ఓ గెస్ట్ రోల్‌లో కూడా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
హీరోగా ఎంట్రీ...
మరోవైపు త్వరలోనే హీరోగా కూడా లోకేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డీసీ పేరుతో తమిళంలో ఓ సినిమా చేశాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా రూపొందిన ఈ మూవీలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత – రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా!
ఆగస్టు 21, 2026

Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ – రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్
ఆగస్టు 21, 2026

Jyothi Rai | హీరోయిన్‌గా గుప్పెడంత మనసు జగతి – సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..
- ●Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
- ●Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- ●Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
- ●Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా!

Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..

Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య



