త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market | క్రిస్‌మస్ ఎఫెక్టేనా? స్తబ్దుగా భారత స్టాక్ మార్కెట్లు

కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టీఎంపీవీ కంపెనీలు టాప్ 5 స్టాక్స్‌గా నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా నిలిచాయి.

J

Business | Published On Dec 23, 2025, 4.55 pm IST

Stock Market | క్రిస్‌మస్ ఎఫెక్టేనా? స్తబ్దుగా భారత స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock Market | అసలు భారత స్టాక్ మార్కెట్లలో ఏం జరుగుతోంది? నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కీలక ఇండెక్స్‌లు అయిన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలు స్తబ్దుగా కొనసాగుతున్నాయి. అస్సలు మూవ్‌మెంట్ ఉండటం లేదు. ఉదయం నుంచి సైడ్‌వేస్‌గా ఉండటంతో అసలు ట్రేడ్ చేసే మూడ్ లేక ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇవాళ కూడా బోర్ ఫీల్ అయ్యారు. గత రెండు మూడు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు స్తబ్దుగానే ఉంటున్నాయి. నిన్నటి లాగానే ఇవాళ కూడా మార్కెట్లలో ఏం జరగలేదు. అటు బుల్లిష్ లేదు.. ఇటు బేరిష్ లేదు. ఓవైపు భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా క్రిస్‌మస్ సంబురాల్లో ఉండగా, ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా భారత్  మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ సమయంలో ఆసక్తి చూపించడం లేదు. అందుకే మార్కెట్లు స్తబ్దుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

నిఫ్టీ 50.. కేవలం 4 పాయింట్లు లాభ పడి 26,177 పాయింట్ల వద్ద ముగిసింది. 26,205 పాయింట్ల వద్ద ఉదయం గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా ఆ తర్వాత సైడ్ వేస్‌గా మారడంతో ట్రేడ్ తీసుకోవాలన్నా ట్రేడర్లు భయపడ్డారు. ఈరోజు లో 26,119 కాగా, ఈ రోజు హై 26,233 గా ఉంది. నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్‌లో 24 పాజిటివ్‌గా ఉండగా, 26 నెగెటివ్‌గా ఉన్నాయి.

Stock Market | లాభపడ్డ కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, ఆల్ట్రాటెక్, టీఎంపీవీ

ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ ఉన్నా.. కొన్ని స్టాక్స్ లాభపడ్డాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టీఎంపీవీ కంపెనీలు టాప్ 5 స్టాక్స్‌గా నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా నిలిచాయి. ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, అదానిపోర్ట్స్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా నష్టపోయిన స్టాక్స్‌లో టాప్ 5 లో ఉన్నాయి.

ఇక.. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, 59,299 పాయింట్ల వద్ద 4 పాయింట్లు నష్టపోయి క్లోజ్ అయింది. ఉదయం గ్యాప్ అప్‌తో 59,334 పాయింట్ల వద్ద ఓపెన్ కాగా, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్స్ నష్టపోగా, కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ మాత్రం లాభపడ్డాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement