Srisailam | శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. వారంలో మూడు రోజులు ఆ దర్శనాలు రద్దు
Srisailam | శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో (Srisailam) కార్తీక మాసోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి.
Devotional | Published On Nov 10, 2026, 8.53 am IST
Srisailam | త్రినేత్ర న్యూస్: శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో (Srisailam) కార్తీక మాసోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. డిసెంబర్ 9 వరకు మాసోత్సవాలు (Karthika Masotsavam) అత్యంత వైభవంగా జరుగుతాయి. పాడ్యమి ఘడియలు రావడంతో సోమవారం రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు ఆకాశ దీపానికి పూజలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య ఆకాశ దీపాన్ని ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో నెల రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు (Abhishekams) పూర్తిగా నిలిపివేశారు. ప్రతి శని, ఆది, సోమ వారాలతో పాటు పర్వదినాల్లో స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేశారు. దీంతో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. అలాగే క్షేత్రంలోని పురాతన పంచమఠాలలో కొలువై ఉన్న శివలింగాలకు అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. శని, ఆది, సోమవారాల్లో స్వామి వారి అలంకార దర్శనం ఉంటుంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు విడతల వారీగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 24న ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. కార్తీక మాసోత్సవాల సమయంలో పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు (Arjitha Abhishekams) నిర్వహిస్తారు.
దీనికోసం భక్తులు రూ.216 చెల్లించాల్సి ఉంటుంది. ఒక సేవాటిక్కెట్టుపై దంపతులు లేదా ఒకరికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. భక్తులు అభీష్టం మేరకు ఈ సేవాటిక్కెట్టుపై ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠాలలోని ఏదైనా ఒకమఠంలో అభిషేకాన్ని జరిపించుకోవచ్చు
సంబంధిత వార్తలు

Private Travel Bus | శ్రీశైలం వెళ్తుండగా ట్రావెల్స్ బస్సులో మంటలు.. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు
సెప్టెంబర్ 24, 2026

Harish Rao | 4 వేలకు అవకాశం ఉంటే 800 క్యూసెక్కులే ఎందుకు ఎత్తిపోస్తున్నవ్..?
సెప్టెంబర్ 23, 2026

KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Karthika Masam | నేటి నుంచి కార్తీక మాసం.. శివారాధకులకు ప్రీతిపాత్రమైన నెల
- ●Indian Railway | భారతీయ రైల్వేలో 4651 అప్రెంటిస్‌లు..
- ●Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్
- ●Horoscope | నవంబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●LB Nagar Sadar Festival Accident | సదర్ ఉత్సవాల్లో విషాదం: దున్నపోతును ఆడిస్తూ కుప్పకూలి 16 ఏళ్ల బాలుడు మృతి
- ●Bangladesh Woman Fake Aadhaar Hyderabad | బంగ్లాదేశ్ యువతి నకిలీ ఆధార్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి!

Karthika Masam | నేటి నుంచి కార్తీక మాసం.. శివారాధకులకు ప్రీతిపాత్రమైన నెల

Indian Railway | భారతీయ రైల్వేలో 4651 అప్రెంటిస్‌లు..

Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్

Horoscope | నవంబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారికి శుభ ఖర్చులు ఉంటాయి!



