Stock Markets | యుద్ధ భయంతో మార్కెట్లు డల్.. క్రూడ్ మళ్ళీ పెరిగింది..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు పడిపోయి 76,429.91 వద్ద ఉండగా, నిఫ్టీ50 సూచీ 24.019 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం నాడు వచ్చిన బుల్ ర్యాలీ అనంతరం పెట్టుబడిదారుల వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు పడిపోయి 76,429.91 వద్ద ఉండగా, నిఫ్టీ50 సూచీ 24.019 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం నాడు వచ్చిన బుల్ ర్యాలీ అనంతరం పెట్టుబడిదారుల వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. యుద్ధం భయం కారణంగా వారు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని సూచీలను చూస్తే అర్థమవుతోంది. సోమవారం నాడు సెన్సెక్స్ ఏకంగా 1073 ఎగబాకగా, నిఫ్టీ 312 పాయింట్లు పెరిగింది. అయితే మంగళవారం నాటి సెషన్ లో మాత్రం రిస్క్‌తో నిండిన భావన కనిపిస్తోంది. అందుకనే మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే నిఫ్టీ ఎఫ్ అండ్ వో నెలవారీ ఎక్స్‌పైరీ కూడా ఉండడంతో పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
పెరిగిన చమురు ధరలు..
అమెరికా ఆర్మీ తాజాగా దక్షిణ ఇరాన్‌పై దాడులు నిర్వహించడంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ సోమవారం నాడు భారీగా పతనమైనా మంగళవారం మళ్లీ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.70 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 95.01 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.35 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్ల వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 1.51 శాతం పెరిగి 8,756 వద్ద ఉండగా, దేశీయంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటేజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియా సంక్షోభం ముగిసే సూచనలు ప్రస్తుతం ఏవీ కనిపించడం లేదన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ అవి కొలిక్కి వచ్చే సూచనలు కనబడడం లేదని, అమెరికా సెల్ఫ్ డిఫెన్స్ పేరిట దక్షిణ ఇరాన్‌పై దాడులు నిర్వహించడం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలను దెబ్బ తీసిందని అన్నారు.
రూపాయి మళ్లీ పతనం..
ఫారెక్స్ మార్కెట్‌లో మరోమారు రూపాయి విలువ పతనమైంది. సోమవారం నాటి సెషన్‌లో బలంగా పుంజుకున్న రూపాయి మంగళవారం సెషన్‌లో మాత్రం ర్యాలీని కొనసాగించలేకపోయింది. ఈ సెషన్‌లో అమెరికా డాలర్‌కు రూపాయి విలువ 20 పైసలు తగ్గి 95.42 వద్ద ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లు వార్తలకు అనుగుణంగా స్పందిస్తున్నందున పెట్టుబడిదారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని, నష్టాలు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని, దూకుడుగా వ్యవహరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?






