త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన ప‌డ‌వ‌.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..

Boat Capsizes | వాయ‌వ్య నైజీరియాలో (Nigeria) ఘోర ప‌డ‌వ‌ ప్ర‌మాదం (Boat Capsizes) జరిగింది. సోకోటో రాష్ట్రంలోని గోరౌ (Gorau) ప్రాంతంలో పరిమితికి మించి (Overloaded) ప్రయాణికులతో వెళ్తున్న ప‌డ‌వ నీట మునిగింది.

G

International | Published On Aug 21, 2026, 8.33 am IST

Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన ప‌డ‌వ‌.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..
Advertisement

Boat Capsizes | త్రినేత్ర‌.న్యూస్‌: వాయ‌వ్య నైజీరియాలో (Nigeria) ఘోర ప‌డ‌వ‌ ప్ర‌మాదం (Boat Capsizes) జరిగింది. సోకోటో రాష్ట్రంలోని గోరౌ (Gorau) ప్రాంతంలో పరిమితికి మించి (Overloaded) ప్రయాణికులతో వెళ్తున్న ప‌డ‌వ నీట మునిగింది. దీంతో 50 మందికిపైగా మ‌ర‌ణించారు. వారిలో 40 మంది వ‌ర‌కు చిన్నారులు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 40 మంది చిన్నారుల‌ మృతదేహాలను వెలికితీశామ‌ని అధికారులు తెలిపారు.

వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం ప‌డ‌వ‌లో న‌ది దాటుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఏరియా మేనేజర్ అబ్దుల్ ఖాదిర్ యూసుఫ్ (Abdulkadir Yusuf) చెప్పారు. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 70 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని తెలిపారు. అయితే ప‌డ‌వ‌లో 57 మంది ఉన్నార‌ని స్థానికులు వెల్ల‌డించారు. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA), నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ అధికారులు గ‌ల్లంతైన వారికోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

నైజీరియాలో నదులు, జలమార్గాల్లో పడవ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దేశంలో రోడ్లు సరిగ్గా లేని కారణంగా ఎక్కువగా నీటి మార్గం ద్వారానే ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇలాంటి ప్రమాదాలు ఆ దేశంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో పడవ ప్రమాదంలో 25మందికిపైగా మరణించారు. గతేడాది నవంబర్ నెలలో జరిగిన ప్రమాదంలో 27మంది మృతి చెందారు.

 

Advertisement
Advertisement