Stock Markets | ఎఫ్ఐఐల కొనుగోళ్లు.. డీఐఐల అమ్మకాలు.. స్టాక్ మార్కెట్ల దారెటు..
Stock Markets | విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
Stock Markets | విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
స్వల్ప నష్టాల్లో సూచీలు..
భారత స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 52.20 పాయింట్లు (0.06 శాతం) తగ్గి 81,827.20 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 26.30 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 25,227.50 వద్ద ప్రారంభమైంది. నవంబర్‌లో ఇప్పటివరకు ఏడు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 9.55 శాతం ర్యాలీ చేయడానికి ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారుల భారీ కొనుగోళ్లే కారణమని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. గతంలో ఎఫ్ఐఐలు అమ్మకాలు చేస్తూ, డీఐఐలు కొనుగోళ్లు జరపగా.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, దేశీయ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించే అవకాశం ఉందని, ఈ పరిణామాలే సమీప కాలంలో మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని వివరించారు.
తగ్గిన చమురు ధరలు..
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.12 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.38 శాతం లాభపడగా, నిఫ్టీ 100 సూచీ 0.12 శాతం నష్టపోయింది. రంగాల వారీగా నిఫ్టీ ఆటో 0.34 శాతం, ఐటీ 0.71 శాతం, ఫార్మా 0.27 శాతం, ప్రైవేట్ బ్యాంక్ 0.03 శాతం నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ 0.02 శాతం, మీడియా 0.12 శాతం, మెటల్ 0.09 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.11 శాతం లాభపడ్డాయి. కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక శాతం తగ్గి బ్యారెల్‌కు 91.78 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ ఒక శాతం, సింగపూర్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.06 శాతం నష్టపోయాయి. జపాన్ నిక్కీ 0.24 శాతం, తైవాన్ సూచీ స్వల్పంగా, దక్షిణ కొరియా కోస్పి సూచీ 0.28 శాతం లాభాలతో ట్రేడయ్యాయి.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | లాభాల స్వీకరణ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.21వేలు తగ్గిన పసిడి ధర..
- ●2027 UP Elections | ఒవైసీ కొత్త ఎత్తుగడ.. యూపీలో మూడో ఫ్రంట్..!
- ●Asifabad |ఆసిఫాబాద్‌లో పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు..
- ●Kishtwar | బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఉగ్రవాదుల పనేనా..?
- ●Gig Workers | 14న గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
- ●Sekhar Master | రోడ్డు ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు గాయాలు

Gold And Silver Prices Today | లాభాల స్వీకరణ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.21వేలు తగ్గిన పసిడి ధర..

2027 UP Elections | ఒవైసీ కొత్త ఎత్తుగడ.. యూపీలో మూడో ఫ్రంట్..!

Asifabad |ఆసిఫాబాద్‌లో పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు..

Kishtwar | బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఉగ్రవాదుల పనేనా..?






