త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఐటీ స్టాక్స్ దూకుడు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లపై ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్, ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం ప్రపంచ మార్కెట్లను ఒత్తిడిలో ఉంచుతున్నాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లలో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పైకి కదిలాయి.

S

Business | Published On Sep 15, 2026, 10.27 am IST

Stock Markets | ఐటీ స్టాక్స్ దూకుడు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లపై ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్, ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం ప్రపంచ మార్కెట్లను ఒత్తిడిలో ఉంచుతున్నాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లలో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పైకి కదిలాయి. సెన్సెక్స్‌ 75,369.63 వద్ద ప్రారంభమై 587.87 పాయింట్లు (0.79 శాతం) లాభపడింది. నిఫ్టీ 23,576.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి 178.05 పాయింట్లు (0.76 శాతం) పెరిగింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. నిఫ్టీ ఐటీ సూచీ 4 శాతానికి పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ మిడ్‌స్మాల్ ఐటీ అండ్ టెలికాం సూచీ దాదాపు 2 శాతం పెరిగింది.

మెట‌ల్ షేర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి..

ఇతర రంగాలను పరిశీలిస్తే నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.72 శాతం, నిఫ్టీ ఆటో సూచీ 0.31 శాతం లాభపడ్డాయి. మీడియా, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంకింగ్ సూచీలు కూడా స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మెటల్ సూచీ 0.58 శాతం పడిపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్-బ్యాంక్ సూచీ 0.52 శాతం, నిఫ్టీ మిడ్‌స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 0.50 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఫార్మా 0.37 శాతం నష్టపోగా, సిమెంట్, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ సూచీలు కూడా దిగువకు కదిలాయి. నిఫ్టీ 50లో కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు టాప్ లూజర్లుగా నిలిచాయి. ఈ షేర్లు దాదాపు 1 నుంచి 1.67 శాతం వరకు నష్టపోయాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్ మానసికంగా కీలకమైన 5 శాతం స్థాయిని చేరుకోవడం వల్ల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి కొనసాగుతుంద‌ని మార్కెట్ నిపుణులు తెలిపారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా స్థూల ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చమురు ధ‌ర‌లు మంగ‌ళ‌వారం సైతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.98 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 103 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.41 శాతం ఎగ‌సి బ్యారెల్‌కు 103 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మళ్లీ బ‌ల‌హీన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.838 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.33 శాతం న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement