Indiramma Towers | 14 నియోజకవర్గాల్లో 1,741 ఫ్లాట్లకు.. నేడు మరోసారి ఇ-లాటరీ
Indiramma Towers | హైదరాబాద్‌లో నిలిచిపోయిన 1,741 ఇందిరమ్మ ఫ్లాట్ల (Indiramma Towers) పునఃకేటాయింపునకు తెలంగాణ హౌసింగ్ బోర్డు 'మాప్-అప్' (Mop-up) ఈ-లాటరీని నిర్వహిస్తున్నది.
Indiramma Towers | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లో నిలిచిపోయిన 1,741 ఇందిరమ్మ ఫ్లాట్ల (Indiramma Towers) పునఃకేటాయింపునకు తెలంగాణ హౌసింగ్ బోర్డు 'మాప్-అప్' (Mop-up) ఈ-లాటరీని నిర్వహిస్తున్నది. బుధవారం (నవంబర్ 4న) ఇందిరమ్మ టవర్స్ ప్రకటించిన 14 నియోజకవర్గాల్లో 1741 ఫ్లాట్లకు మళ్లీ ఇ-లాటరీ (e-lottery) తీయనున్నారు. బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఇ-లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన దరఖాస్తుదారులు https://youtube.com/@tghd.officialలో లైవ్ చూసుకునే వెసులుబాటు కల్పించారు.
గతేడాది ఆగస్టులో మొదటి విడత కింద 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరు దరఖాస్తుదారులు అనర్హులుగా తేలడం, మొదట తీసిన లాటరీలో పేర్లు వచ్చిన వారు నియోజకవర్గం తప్పుగా నమోదు చేయడం, రూ.6లక్షలు చెల్లించాలనడంతో కొందరు వెనుకంజ వేయడం, సొంత ఇల్లు కలిగి ఉండటం, నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకపోవడం వంటి కారణాలతో దాదాపు 1,741 ఫ్లాట్లు మిగిలిపోయాయి. వాటినే ఇప్పుడు తిరిగి కేటాయిస్తున్నారు. 14 చోట్ల మళ్లీ లాటరీ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటిలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్మించనున్న ఫ్లాట్లే అత్యధికంగా 327 ఉన్నాయి.
శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం మినహా 14 నియోజకవర్గాల్లో మిగిలిన 1,741 ఫ్లాట్లకు తొలి విడత లాటరీలో పేరురాకుండా మిగిలిన 17,867 మంది అర్హులతో నేడు మరోసారి డ్రా తీయనున్నారు. ఫ్లాట్ల సంఖ్యకు అదనంగా 50 శాతం మందిని ఎంపిక చేసి.. వారి పేర్లను నిరీక్షణ జాబితాలో పెట్టనున్నారు. మొత్తానికి అర్హులుగా తేలిన వారికి ఏదో ఓ దశలో ఇల్లు మాత్రం వస్తుందని హౌసింగ్‌బోర్డు వర్గాలు అంటున్నాయి. కాగా, మంగళవారం (నవంబర్ 3న) ముషీరాబాద్ (Musheerabad), ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట (Chandrayangutta), గోషామహల్ నియోజకవర్గాలకు సంబంధించి 1,920 కొత్త ఫ్లాట్ల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ విజయవంతంగా ముగిసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR Speech Khairatabad | తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలక ఎడారి
నవంబర్ 3, 2026

Gold Price | ధన్‌తేరస్‌కు ముందే బంగారం ధరలకు బ్రేక్.. తులంపై రూ.700 డౌన్.. వెండి రూ.2వేలు..!
నవంబర్ 3, 2026

IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●POWERGRID | బీటెక్ అభ్యర్థులకు శుభవార్త.. పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు
- ●Horoscope | నవంబర్ 4 రాశిఫలాలు.. రహస్య కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●Hyderabad Water Crisis | హైదరాబాద్‌లో నీటి కొరత ఎఫెక్ట్: కాలేజీలకు ముందే దీపావళి సెలవులు.. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో భారీ రద్దీ
- ●KTR Speech Khairatabad | తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలక ఎడారి
- ●US Midterm Elections 2026 | అమెరికాలో 'మినీ' ఎన్నికల సమరం.. డొనాల్డ్ ట్రంప్‌నకు అసలైన అగ్నిపరీక్ష.. కాంగ్రెస్ పగ్గాలు దక్కేది ఎవరికి?
- ●Gold Price | ధన్‌తేరస్‌కు ముందే బంగారం ధరలకు బ్రేక్.. తులంపై రూ.700 డౌన్.. వెండి రూ.2వేలు..!

POWERGRID | బీటెక్ అభ్యర్థులకు శుభవార్త.. పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు

Horoscope | నవంబర్ 4 రాశిఫలాలు.. రహస్య కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది!

Hyderabad Water Crisis | హైదరాబాద్‌లో నీటి కొరత ఎఫెక్ట్: కాలేజీలకు ముందే దీపావళి సెలవులు.. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో భారీ రద్దీ

KTR Speech Khairatabad | తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలక ఎడారి



