త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మార్కెట్లకు ఆర్బీఐ షాక్.. ఐటీ స్టాక్స్‌లో మాత్రం జోష్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో మార్కెట్లపై ఏర్పడిన ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం 9:22 గంటలకు సెన్సెక్స్ 72,440.59 వద్ద ట్రేడవుతూ 198.11 పాయింట్లు (0.27 శాతం) నష్టపోయింది. సెన్సెక్స్ 72,668.00 వద్ద ప్రారంభమై, తొలుత 72,693.97 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

S

Business | Published On Oct 8, 2026, 10.33 am IST

Stock Markets | మార్కెట్లకు ఆర్బీఐ షాక్.. ఐటీ స్టాక్స్‌లో మాత్రం జోష్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో మార్కెట్లపై ఏర్పడిన ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం 9:22 గంటలకు సెన్సెక్స్ 72,440.59 వద్ద ట్రేడవుతూ 198.11 పాయింట్లు (0.27 శాతం) నష్టపోయింది. సెన్సెక్స్ 72,668.00 వద్ద ప్రారంభమై, తొలుత 72,693.97 వద్ద గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 50 కూడా నష్టాల్లోనే ట్రేడవుతోంది. విస్తృత మార్కెట్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అయితే మార్కెట్‌లో ఐటీ స్టాక్స్ మాత్రం ఇతర రంగాలకు భిన్నంగా రాణిస్తున్నాయి. టీసీఎస్ 2.48 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.11 శాతం, టెక్ మహీంద్రా 1.82 శాతం, ఇన్ఫోసిస్ 1.64 శాతం లాభపడ్డాయి. సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌పై ఇన్వెస్టర్ల దృష్టి మళ్లడంతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. టీసీఎస్ ఈరోజు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఆ షేర్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. నిఫ్టీ ఐటీ సూచీ ప్రారంభ ట్రేడింగ్‌లో 1.96 శాతం పెరిగి, ప్రధాన రంగాల సూచీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచింది.

భారీగా ప‌త‌న‌మైన రిల‌య‌న్స్ షేర్‌..

మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇన్వెస్టర్ల దృష్టిలో ఉంది. ప్రారంభ ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ 0.17 శాతం స్వల్పంగా పడిపోయింది. గత రెండు సెషన్లలో ఈ షేర్ బలమైన లాభాలను నమోదు చేయడంతో పాటు, ఈ నెలలో జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత లిస్టింగ్‌పై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండడంతో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 0.49 శాతం నష్టపోయింది. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతోపాటు తన విధాన వైఖరిని న్యూట్రల్ నుంచి క్యాలిబ్రేటెడ్ టైటెనింగ్ గా మార్చడం మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఈ మార్పు వల్ల ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులపై రాబడులు పెరగడంతో షేర్ మార్కెట్ విలువలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ తెలిపారు.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు చక్రంలో మరో రెండు దఫాలుగా 25 బేసిస్ పాయింట్ల చొప్పున రేట్లు పెరిగే అవకాశం ఉందని, అలా జరిగితే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులపై అధిక రాబడుల కారణంగా షేర్ మార్కెట్ విలువలపై ఒత్తిడి పెరుగుతుందని విజయకుమార్ పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.3 శాతానికి పైగా ఉండడం కూడా లార్జ్ క్యాప్ షేర్లపై ఒత్తిడిని కొనసాగిస్తుంద‌ని ఆయన అన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 102.15 డాలర్ల వద్ద ట్రేడవుతూ 1.95 శాతం పెరిగింది. డబ్ల్యూటీఐ క్రూడ్ 89.73 డాలర్ల వద్ద ఉండగా, 1.64 శాతం లాభపడింది. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగితే భారత్‌లో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగడంతో పాటు రూపాయి విలువ, కంపెనీల లాభాల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement