Stock Markets | ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు.. మార్కెట్ల పయనమెటు..?
Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం షేర్ మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.35 శాతం పెరిగి 76,529.74 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 సూచీ 0.28 శాతం ఎగిసి 23,922.15 వద్ద నిలిచింది.
Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం షేర్ మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.35 శాతం పెరిగి 76,529.74 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 సూచీ 0.28 శాతం ఎగిసి 23,922.15 వద్ద నిలిచింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్లు సుమారు 3 శాతం లాభపడ్డాయి. మరోవైపు రూపాయి ప్రారంభ ట్రేడింగ్‌లో 4 పైసలు బలపడి, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 94.54 వద్ద నిలిచింది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ 23,939 వద్ద ట్రేడవుతుండగా, క్రితం సెషన్‌లో నిఫ్టీ 50 ముగింపు స్థాయి 23,853.90 కంటే ఎగువన మార్కెట్ ప్రారంభమవుతుందనే సంకేతాలు కనిపించాయి.
సందిగ్ధంలో మార్కెట్లు..
బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 83 డాలర్ల పరిధిలోనే కొనసాగాయి. ప్రాథమిక ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాకపోవడం, అలాగే ప్రపంచ ఇంధన సరఫరాల రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎప్పుడు తిరిగి తెరుచుకుంటుందనే అంశంపై అనిశ్చితి కొనసాగడంతో, క్రూడ్ ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శుక్రవారం స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగే వరకు పెట్టుబడిదారులు ఆందోళనగానే ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకనే మార్కెట్లు సందిగ్ధంలో ఉన్నాయంటున్నారు. ఆ విషయంపై స్పష్టత వస్తే మార్కెట్లు మళ్లీ కోలుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్






