Gold And Silver Prices Today | గోల్డ్ ధరలు జంప్.. డాలర్ బలహీనపడడంతో మళ్లీ మెరుపులు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, అమెరికన్ డాలర్ బలహీనపడటం వంటి పరిణామాల నేపథ్యంలో సోమవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, అమెరికన్ డాలర్ బలహీనపడటం వంటి పరిణామాల నేపథ్యంలో సోమవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.40 శాతం పెరిగి 10 గ్రాములకు 1,59,315 వద్ద ట్రేడ్ అయ్యాయి. అదే సమయంలో జూలై సిల్వర్ ఫ్యూచర్స్ 1.44 శాతం ఎగిసి కిలోకు 2,75,750 వద్ద కొనసాగాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ దాదాపు 0.30 శాతం పడిపోవడంతో ఇతర కరెన్సీల్లో కొనుగోలు చేసే వారికి బులియన్ చౌకగా మారింది. దీంతో గోల్డ్‌పై డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా బ్రెంట్ క్రూడ్ ధరలు 5 శాతానికి పైగా క్షీణించి బ్యారెల్‌కు 98 డాలర్లకు దిగువకు చేరాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చన్న వార్తలే ఈ పతనానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.99 శాతం పెరిగి 4,553 వద్ద ఉండగా, వెండి ధర 2.55 శాతం ఎగసి 77.416 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,938 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,27, 504 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,59,380 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,93,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,610 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,61,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,954 ఉండగా, 8 గ్రాముల ధర రూ.95,632గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,19,540 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,95,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,95,000 ఉండగా, తులం ధర రూ.2,950 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?






