త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | బ్యాంకింగ్ షేర్ల‌లో తీవ్ర న‌ష్టాలు.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం న‌ష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా భారీ బ్యాంకింగ్ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు క్షీణించాయి. అయితే ఫార్మా, ఐటీ షేర్లు కొంత మద్దతు ఇవ్వడంతో మరింత పెద్ద పతనం నుంచి మార్కెట్‌కు ఉపశమనం లభించింది.

S

Business | Published On Jul 20, 2026, 10.13 am IST

Stock Markets | బ్యాంకింగ్ షేర్ల‌లో తీవ్ర న‌ష్టాలు.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం న‌ష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా భారీ బ్యాంకింగ్ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు క్షీణించాయి. అయితే ఫార్మా, ఐటీ షేర్లు కొంత మద్దతు ఇవ్వడంతో మరింత పెద్ద పతనం నుంచి మార్కెట్‌కు ఉపశమనం లభించింది. శుక్రవారం 78,151.45 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం అదే స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, 77,694.13 వద్ద ట్రేడ్ అవుతూ 457.32 పాయింట్లు (0.59 శాతం) నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 కూడా గత సెషన్‌లో 24,334.30 వద్ద ముగియగా, సోమవారం 24,190.05 వద్ద ప్రారంభమై 24,227.90 వద్ద ట్రేడ్ అవుతూ 106.40 పాయింట్లు (0.44 శాతం) క్షీణించింది. ఈ పతనానికి ప్రధాన కారణం ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు చోటు చేసుకోవ‌డ‌మే. నిఫ్టీ50లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా పడిపోయింది. మొదటి త్రైమాసిక ఫలితాలు, ముఖ్యంగా నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ (ఎన్‌ఐఎమ్) అంచనాలను అందుకోకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ రూ.37.80 పడిపోయి రూ.781.80 వద్ద ట్రేడ్ అయింది.

బ్యాంకింగ్ షేర్ల‌లో న‌ష్టాలు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ముఖ్యంగా ఎన్‌ఐఎమ్ విషయంలో నిరాశపరిచిందని పేర్కొన్నారు. యాక్సిస్ బ్యాంక్ షేర్ రూ.54.60 (4.11 శాతం) క్షీణించి రూ.1,273.90కు చేరగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ రూ.11.75 పడిపోయి రూ.378.20 వద్ద ట్రేడ్ అయింది. ఇండిగో షేర్ 1.46 శాతం తగ్గి రూ.5,172.00కు చేరగా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ 1.17 శాతం క్షీణించి రూ.240.13 వద్ద నిలిచింది. అయితే అన్ని బ్యాంకుల ఫలితాలు నిరాశపరచలేదని విజయకుమార్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ అన్ని విభాగాల్లో అద్భుతమైన పనితీరుతో బలమైన ఫలితాలను ప్రకటించిందని, కోటక్ బ్యాంక్ కూడా మంచి ఫలితాల‌ను నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీంతో బ్యాంకింగ్ రంగంలో షేర్ల కదలికలు కంపెనీల ఫలితాల ఆధారంగా భిన్నంగా కనిపిస్తున్నాయని వివరించారు.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

లాభాల్లో నిలిచిన షేర్లలో సిప్లా 1.47 శాతం పెరిగి రూ.1,439.50కు చేరింది. టెక్ మహీంద్రా 1.41 శాతం లాభపడి రూ.1,595.00 వద్ద ట్రేడ్ అయింది. గత వారం ఐటీ రంగం 4.2 శాతం పెరగడంతో ఆ రంగంలో సానుకూల ధోరణి కొనసాగుతోంది. ఓఎన్‌జీసీ 1.41 శాతం పెరిగి రూ.250.78కు చేరగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.38 శాతం లాభపడి రూ.1,254.40కు చేరింది. హిందాల్కో 1.27 శాతం పెరిగి రూ.956.10 వద్ద ట్రేడ్ అవుతూ మెటల్స్, ఎనర్జీ రంగాలకు మద్దతు ఇచ్చింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మరోమారు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.93 శాతం మేర పెరిఇ బ్యారెల్‌కు 88 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.18 శాతం పెరిగి బ్యారెల్‌కు 84 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 18 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి 96.43 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement