Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి భారీ నష్టాల్లో కొనసాగినప్పటికీ మార్కెట్ సెషన్ చివరి సమయంలో పెట్టుబడిదారులు భారీ ఎత్తున కొనుగోళ్లు చేపట్టారు. దీంతో చాలా వరకు నష్టాన్ని సూచీలు రికవరీ చేశాయి.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి భారీ నష్టాల్లో కొనసాగినప్పటికీ మార్కెట్ సెషన్ చివరి సమయంలో పెట్టుబడిదారులు భారీ ఎత్తున కొనుగోళ్లు చేపట్టారు. దీంతో చాలా వరకు నష్టాన్ని సూచీలు రికవరీ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 187.90 పాయింట్లు (0.24 శాతం) పతనమై 77,966.35 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 35.75 పాయింట్లు తగ్గి 24,435.95 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లలో భయ సూచికను నిర్దారించే ఇండియా విక్స్ 1.43 శాతం మేర తగ్గి 11.69 వద్ద నిలిచింది. ముడిచమురు ధరలు పెరుగుతుండడం కారణంగా పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి నెలకొందని, అందుకనే సూచీలు తీవ్ర అస్థిరతతో కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ సెషన్‌లో మరోమారు పెరిగినా, చివరి సమయంలో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ జోష్ వచ్చింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు ధరల పెరుగుదల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతుందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. యుద్ధం పూర్తిగా ముగుస్తేనే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.51 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 86 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.62 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 83 డాలర్లకు దిగి వచ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి మెరుగైన ప్రదర్శన చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.32 వద్ద ఉన్న రూపాయి ఈ సెషన్‌లో 0.11 శాతం లాభపడింది.
టాటా చైర్మన్ ప్రకటన ఎఫెక్ట్..
సూచీలు అంత భారీగా పతనమైన తరువాత వచ్చిన ర్యాలీకి ఫైనాన్షియల్ స్టాక్స్ కారణం అయ్యాయి. ఆ స్టాక్స్‌లో భారీగా కొనుగోళ్లు చోటు చేసుకోవడం మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. బ్యాంక్ నిఫ్టీ సైతం ఇంట్రా డే గరిష్ట స్థాయిలో ముగిసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు షేర్లు 4 శాతానికి పైగా లాభపడ్డాయి. టాప్ గెయినర్లలో హిందాల్కో ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఎంసీఎక్స్ నిలవగా, టాప్ లూజర్లలో టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నిలిచాయి. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మరోమారు ఆ పదవిలో కొనసాగేందుకు సుముఖంగా లేనని ప్రకటించడంతో టాటా కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ
- ●Revamped Gold Monetisation Scheme | భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల నిధి.. వృథాగా మూలనపడ్డ బంగారంతో కేంద్రం 'గోల్డెన్' స్కీమ్!
- ●FCRA Bill | జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు
- ●UPI Payments | యూపీఐలో సగటున ఒక్కో లావాదేవీకి నిర్వహణ ఖర్చు అసలు ఎంతవుతుంది..?
- ●Harish Rao | ఉదయ్ నాగరాజు తెలంగాణలో ఉదయించి.. లండన్‌లో వెలుగుతుండు
- ●Gachibowli Dogs Rescue | ఒకే ఫ్లాట్‌లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్

Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ

Revamped Gold Monetisation Scheme | భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల నిధి.. వృథాగా మూలనపడ్డ బంగారంతో కేంద్రం 'గోల్డెన్' స్కీమ్!

FCRA Bill | జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు

UPI Payments | యూపీఐలో సగటున ఒక్కో లావాదేవీకి నిర్వహణ ఖర్చు అసలు ఎంతవుతుంది..?






