త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sea Planes | హుస్సేన్ సాగ‌ర్ టు ప్ర‌కాశం బ్యారేజీ.. సీ ప్లేన్‌లు న‌డ‌పాల‌న్న సీఎం రేవంత్

Sea Planes | ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ ర‌హ‌దారితో పాటు వ‌రంగ‌ల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనుల‌పై కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించిన సీఎం రేవంత్ రెడ్డి స‌రికొత్త ప్ర‌తిపాద‌న చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడితో భేటీ సంద‌ర్భంగా ఈ అంశాన్ని సీఎం లేవనెత్తారు.

S

Telangana | Published On Jul 14, 2026, 3.19 pm IST

Sea Planes | హుస్సేన్ సాగ‌ర్ టు ప్ర‌కాశం బ్యారేజీ.. సీ ప్లేన్‌లు న‌డ‌పాల‌న్న సీఎం రేవంత్
Advertisement

Sea Planes | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ ర‌హ‌దారితో పాటు వ‌రంగ‌ల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనుల‌పై కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించిన సీఎం రేవంత్ రెడ్డి స‌రికొత్త ప్ర‌తిపాద‌న చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడితో భేటీ సంద‌ర్భంగా ఈ అంశాన్ని సీఎం లేవనెత్తారు.

హుస్సేన్ సాగ‌ర్ నుంచి ప్ర‌కాశం బ్యారేజీకి సీ ప్లేన్‌లు న‌డ‌పాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ సూచించారు. ఈ అంశాన్ని ప‌రిశీలించాల‌న్న సీఎం సూచ‌న‌ల‌పై అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర మంత్రి కోరారు.

ఈ స‌మావేశంలో న‌ల్గొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి గారు, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌ గారు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ఎక్స్-అఫీషియో స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ కె. రామ‌కృష్ణారావుతో పాటు సివిల్ ఏవియేష‌న్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీలో ప‌ది చోట్ల సీప్లేన్లు

ఏపీ పర్యాటక రంగంలో సీ ప్లేన్​ ప్రాజెక్టుకు ఈ ఏడాది మే నెల‌లో ముందడుగు పడింది. మొత్తం పదిచోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లో'టింగ్ జెట్టీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లను కేంద్రం కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులను చేపట్టనున్నారు.

విజయవాడలోని బెర్మ్ పార్క్ - శ్రీశైలం మధ్య 2025లో నిర్వహించిన ట్రయల్ రన్​లో సీఎం చంద్ర‌బాబు సీప్లేన్​లో శ్రీశైలం వరకు ప్రయాణించారు. ఏపీలో తీర ప్రాంతంతోపాటు నదులు, జలాశయాలకు కొదవ లేకపోవడంతో మరిన్ని చోట్ల వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు మరో తొమ్మిది చోట్ల ప్రతిపాదించారు.

Advertisement
Advertisement