త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayesha Khan | డైమండ్‌ రింగ్‌తో అయేషా ఖాన్‌.. ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందా ఏంటీ..?

Ayesha Khan | బాలీవుడ్‌ నటి ఆయేషా ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఓ మిస్టరీ వ్యక్తితో కలిసి దిగిన చిత్రాల్లో ఆమె చేతికి మెరిసే డైమండ్‌ రింగ్‌ కనిపించడంతో.. ఆయేషా నిశ్చితార్థం చేసుకున్నారంటూ అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

P

Entertainment | Published On Aug 19, 2026, 3.35 pm IST

Ayesha Khan | డైమండ్‌ రింగ్‌తో అయేషా ఖాన్‌.. ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందా ఏంటీ..?
Advertisement

Ayesha Khan | బాలీవుడ్‌ నటి ఆయేషా ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఓ మిస్టరీ వ్యక్తితో కలిసి దిగిన చిత్రాల్లో ఆమె చేతికి మెరిసే డైమండ్‌ రింగ్‌ కనిపించడంతో.. ఆయేషా నిశ్చితార్థం చేసుకున్నారంటూ అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు ‘ఏ డ్రీమ్‌’ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌ ఆసక్తిని మరింత పెంచింది. తాజా ఫొటోల్లో ఆయేషా ఓ వ్యక్తితో కలిసి కనిపించారు. అయితే, అతని ముఖాన్ని మాత్రం ఆమె పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడింది. అదే సమయంలో ఆమె చేతికి ఉన్న డైమండ్‌ రింగ్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. ఆయేషా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందా? అంటూ ఆరా తీస్తున్నారు. ఈ ఫొటోలకు మరో కోణం కూడా ఉన్నది. ఆయేషా ధరించిన ఆభరణాలను బట్టి చూస్తే.. ఇది ఓ జువెలరీ బ్రాండ్‌కు సంబంధించిన ఫొటోషూట్‌లో భాగమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫొటోల్లో మిస్టరీ వ్యక్తి ముఖాన్ని కూడా ఆమె దాచడంతో.. అసలు విషయం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. అయితే, తన నిశ్చితార్థంపై అయేషా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో రింగ్‌ నిజంగా నిశ్చితార్థానికి సంబంధించినదేనా? లేక ప్రచార చిత్రాల్లో భాగమా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగిలింది.

‘షరారత్‌’తో ఒక్కసారిగా గుర్తింపు

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ధురంధర్‌’లోని ‘షరారత్‌’ పాట ఆయేషా ఖాన్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాటలో ఆమెతో పాటు క్రిస్టల్‌ డిసౌజా కూడా కనిపించారు. కరాచీలో జరిగే ఓ భారీ వివాహ వేడుక నేపథ్యంలో పాటను తెరకెక్కించారు. పెళ్లి వేడుకల సందడి, గ్లామర్‌తో ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించారు.  పాటలో ఆయేషా, క్రిస్టల్‌ వెడ్డింగ్‌ డ్యాన్సర్లుగా కనిపించి ఆకట్టుకున్నారు. వీరి డ్యాన్స్‌, గ్లామర్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘షరారత్‌’కు శాశ్వత్‌ సచ్‌దేవ్‌ సంగీతం అందించగా.. మధుబంతి బాగ్చీ, జాస్మిన్‌ సాండ్లాస్‌ ఆలపంచారు. విజయ్‌ గంగూలీ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం, అయేషా ఖాన్‌ పంచుకున్న తాజా ఫొటోలే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఆమె నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆయేషా ఖాన్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. 2022లో విశ్వక్‌సేన్‌ హీరోగా వచ్చిన ముఖచిత్రంతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులోనూ ఓం బీమ్‌ బుష్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, మనమే మూవీల్లోనూ నటించింది. ఆ తర్వాత జాట్‌ మూవీలో కానిస్టేబుల్‌గా కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

Advertisement
Advertisement