Kiara Advani | కియారా అద్వానీకి బాడీగార్డ్‌లా మారిన యశ్ – ప్రెగ్నెన్సీతోనే షూటింగ్
టాక్సిక్‌లో కియారా అద్వానీ నటనపై హీరో యశ్ ప్రశంసల వర్షం కురిపించాడు. నదియా పాత్రకు కియారా న్యాయం చేయలేదని అనుకున్నానని, ఫస్ట్ డేనే తనలోని భయాలన్నీ కియారా పోగొట్టిందని యశ్ అన్నాడు. కియారా ప్రెగ్నెంట్ అని తెలియడంతో సెట్స్‌లో ఆమెకు బాడీగార్డ్‌లా పనిచేసినట్లు చెప్పాడు.
Entertainment | Published On Aug 14, 2026, 3.00 pm IST
Kiara Advani | యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కన్నడ ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేయబోతుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నదియా అనే బోల్డ్ రోల్‌లో కియారా కనిపించనుంది. టాక్సిక్ ఫస్ట్ సింగిల్‌లో కియారా అద్వానీ అందాల ఆరబోతపై జోరుగా చర్చ నడిచింది. డబ్బుల కోసమే గ్లామర్ రోల్‌ను కియారా అంగీకరించిందంటూ విమర్శలు వచ్చాయి. ట్రైలర్‌తో ఆ ట్రోల్స్‌కు చెక్ పెట్టింది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌లో కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా మల్టీపుల్ షేడ్స్‌లో కియారా క్యారెక్టర్ కనిపించింది.
సవాల్‌తో కూడిన పాత్ర...
టాక్సిక్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న యశ్ కియారా అద్వానీ క్యారెక్టర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టాక్సిక్ షూటింగ్‌లో ఈ బాలీవుడ్ హీరోయిన్‌కు తానో బాడీగార్డ్‌లా పనిచేశానని అన్నాడు. "నదియా పాత్ర కోసం కియారా అద్వానీ పేరును దర్శకురాలు సూచించింది. యాక్టింగ్ పరంగా సవాల్‌తో కూడిన రోల్ ఇది. మల్టీపుల్ షేడ్స్‌లో సాగుతుంది. ఇలాంటి పాత్రకు ఆమె న్యాయం చేస్తుందా లేదా అనే సందేహం నాలో ఉండేది. ఫస్ట్ డే షూటింగ్‌తోనే ఆ భయాలన్నీ తొలగిపోయాయి. కియారా ప్రొఫెషనలిజానికి ఫిదా అయ్యాను. వర్షంలో తడుస్తూ యాక్ట్ చేసే సీన్ ఫస్ట్ టైమ్ మా కాంబినేషన్‌లో షూట్ చేశారు డైరెక్టర్. తొలుత ఆ సీన్ ఈజీగానే అయిపోతుందని అనుకున్నాం. కానీ చాలా టైమ్ పట్టింది. ఎన్ని టేకులు అయినా ఓర్పుగా డైరెక్టర్ ఓకే అనే వరకు కియారా సీన్ చేస్తూనే ఉంది" అని యశ్ పేర్కొన్నారు.
షూటింగ్ టైమ్‌లో ప్రెగ్నెంట్
"టాక్సిక్ కోసం కియారా పడిన కష్టం, ఆమె అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. షూటింగ్ టైమ్‌లో తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయినా కూడా వంద శాతం కమిట్‌మెంట్‌తో పనిచేసింది. డూప్‌లు లేకుండా యాక్షన్ సీన్లలో తానే స్వయంగా నటించింది. స్క్రీన్‌పై ఆమె యాక్టింగ్‌కు ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతారు. కియారా కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్‌గా టాక్సిక్ నిలిచిపోతుంది" అని యశ్ అన్నారు.
బౌన్సర్లలా...
"కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ తెలియడంతో సెట్స్‌లో మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. నేను, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఆమెకు ఓ బౌన్సర్లు, బాడీగార్డ్‌లుగా కొన్నిసార్లు పనిచేశాం" అని యశ్ తెలిపారు. టాక్సిక్‌లో కియారా అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియాతో పాటు హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ ఫిల్మ్ మేకర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 26న పాన్ ఇండియన్ లెవెల్‌లో ఆరు భాషల్లో రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiara Advani | టాక్సిక్ తర్వాత టాలీవుడ్ – మైథాలజీ మూవీలో కియారా అద్వానీ – రౌడీ బాయ్‌తో రొమాన్స్
ఆగస్టు 10, 2026

Nayanthara | టాక్సిక్ కోసం పదేళ్ల రూల్ బ్రేక్ – నయనతారను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్
ఆగస్టు 9, 2026

Yash | నా భార్యకు థాంక్స్ – తన సపోర్ట్ వల్లే టాక్సిక్ చేయగలిగా – యశ్ కామెంట్స్
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Census 2027 | కులం, కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు.. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- ●WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..
- ●Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్డేట్..
- ●Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది
- ●Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..
- ●Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు

Census 2027 | కులం, కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు.. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం

WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..

Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్డేట్..

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది



