త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Rupee hits All Time Low | గ్రీన్‌లాండ్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన రూపాయి.. రికార్డు స్థాయి కనిష్ఠానికి

బుధవారం ట్రేడింగ్‌లో రూపాయి విలువ 91.69 వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇది 91.74 స్థాయికి కూడా పడిపోయింది. గత రెండు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద ఒక రోజు పతనం.

J

Business | Published On Jan 21, 2026, 5.14 pm IST

Indian Rupee hits All Time Low | గ్రీన్‌లాండ్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన రూపాయి.. రికార్డు స్థాయి కనిష్ఠానికి

సంక్షిప్త సారాంశం

గ్రీన్‌లాండ్ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ (సుంకాల) హెచ్చరికలతో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ప్రభావంతో జనవరి 21, 2026 నాటి ట్రేడింగ్‌లో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 91.69 వద్ద చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

Advertisement

Indian Rupee hits All Time Low | ప్రపంచాన్ని డాలర్ మాత్రమే శాసించాలని, డాలర్‌తోనే ప్రతి దేశం ఏ ట్రేడ్ అయినా చేయాలని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ డాలర్‌ను పటిష్ఠపరుచుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. డాలర్ బలహీనపడితే ప్రపంచ దేశాలు డాలర్‌లో ట్రేడ్ చేయడం ఆపేస్తే.. యూఎస్ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం అవుతుందని ప్రపంచదేశాలను టారిఫ్‌ల పేరుతో యూఎస్ సర్కారు వేదిస్తోంది. ప్రపంచంలో రోజుకో వివాదం తెర మీదికి వస్తుండటంతో గ్లోబల్‌గా మన కరెన్సీ రూపాయి భారీగా పతనం అవుతోంది. గ్రీన్‌లాండ్ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ (సుంకాల) హెచ్చరికలతో గ్లోబల్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. దీని ప్రభావంతో ఇప్పటికే ఒక డాలర్‌కి 90 రూపాయల మార్క్ దాటి రికార్డు స్థాయి కనిష్ఠానికి చేరుకున్న రూపాయి, తాజాగా జనవరి 21, 2026 నాటి ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే 91.69 వద్ద చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

రికార్డు స్థాయి పతనం

బుధవారం ట్రేడింగ్‌లో రూపాయి విలువ 91.69 వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇది 91.74 స్థాయికి కూడా పడిపోయింది. గత రెండు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద ఒక రోజు పతనం.

ట్రంప్ టారిఫ్ ప్రభావం

గ్రీన్‌లాండ్ వివాదానికి సంబంధించి ఐరోపా దేశాలపై టారిఫ్‌లు విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలు, అంతర్జాతీయ బాండ్ మార్కెట్ల పతనం.. ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి బలహీనపడింది.

ఎఫ్ఐఐల అమ్మకాలు

భారత ఈక్విటీ మార్కెట్ల నుండి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి మరో ప్రధాన కారణం. రూపాయి విలువ తగ్గడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి భారం పెరుగుతుంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి (ధరల పెరుగుదల) దారితీసే అవకాశం ఉంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement