త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahanadi Coalfields IPO | పెట్టుబ‌డిదారుల‌కు సువ‌ర్ణావ‌కాశం.. మ‌రో ప్ర‌భుత్వ రంగ సంస్థ ఐపీవోకు..

Mahanadi Coalfields IPO | ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ మ‌హాన‌ది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ను స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్‌లో 25 శాతం వరకు వాటాను ఐపీవో ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కోల్ ఇండియా వెల్లడించింది.

S

Business | Published On May 21, 2026, 3.00 pm IST

Mahanadi Coalfields IPO | పెట్టుబ‌డిదారుల‌కు సువ‌ర్ణావ‌కాశం.. మ‌రో ప్ర‌భుత్వ రంగ సంస్థ ఐపీవోకు..
Advertisement

Mahanadi Coalfields IPO | ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ మ‌హాన‌ది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ను స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్‌లో 25 శాతం వరకు వాటాను ఐపీవో ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కోల్ ఇండియా వెల్లడించింది. బీఎస్‌ఈకి ఇచ్చిన ఫైలింగ్‌లో డిపామ్, బొగ్గు మంత్రిత్వ శాఖ (ఎంఓసీ) కలిసి ఎంసీఎల్ లిస్టింగ్ ప్రతిపాదనను ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఎం) ఆమోదం కోసం ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది. కోల్ ఇండియా బోర్డు, ఎంసీఎల్ బోర్డు ఇచ్చిన అనుమతుల ఆధారంగా ఈ ప్రతిపాదనకు ఏఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపింది. ఈ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా కొత్త ఈక్విటీ షేర్ల జారీతో పాటు, కోల్ ఇండియా తన వాటాలో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో విక్రయించనుంది. అవసరాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ఈ డివెస్ట్‌మెంట్ చేపట్టే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

లిస్టింగ్ కానున్న అన్ని సంస్థ‌లు..

అలాగే ఎంసీఎల్ తాజా ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేసి నిధులు సమీకరించవచ్చు. భవిష్యత్తులో ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్లు (ఎఫ్‌పీఓలు), క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్యూఐపీలు) లేదా సెబీ అనుమతించే ఇతర మార్గాల ద్వారా కూడా క్యాపిటల్ రైజింగ్ చేపట్టే అవకాశం ఉందని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతుల ఆధారంగా డివెస్ట్‌మెంట్, క్యాపిటల్ రైజింగ్ ప్రక్రియలను ఒకేసారి లేదా విడివిడిగా అమలు చేయవచ్చని ఫైలింగ్‌లో పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియ అనంతరం ఎంసీఎల్‌లో కోల్ ఇండియా వాటా 25 శాతం వరకు తగ్గేలా ఈ చర్యలు ఉండనున్నాయి. ఎంసీఎల్ లిస్టింగ్ పూర్తిగా మార్కెట్ పరిస్థితులు, అవసరమైన అన్ని చట్టపరమైన, నియంత్రణ సంబంధిత అనుమతులపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక ప్రధాని కార్యాలయం (పీఎంఓ) 2030 నాటికి కోల్ ఇండియా అనుబంధ సంస్థలన్నింటినీ స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పర్యవేక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం, పారదర్శకత పెంచడం, అసెట్ మోనిటైజేషన్ ద్వారా విలువను వెలికితీయడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంటున్నారు.

పెట్టుబ‌డిదారుల‌కు అవ‌కాశం..

దేశంలో దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన కోల్ ఇండియా ప్రస్తుతం ఎనిమిది అనుబంధ సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాటిలో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ (ఎస్‌ఈసీఎల్), నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్, ఎంసీఎల్, అలాగే సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్) ఉన్నాయి. ఇంతకుముందే కోల్ ఇండియా బోర్డు, సౌత్ ఈస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్)లో 25 శాతం వరకు వాటా విక్రయానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అదనంగా 10 శాతం వరకు తాజా ఈక్విటీ షేర్ల జారీకి కూడా అనుమతి ఇచ్చింది. మరోవైపు భార‌త్ కోకింగ్ కోల్ లిమిటెడ్ గ‌త జనవరిలో విజయవంతంగా స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ కాగా, సెంట్ర‌ల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ మార్చి 30,న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల‌లో లిస్టింగ్ అయింది. అయితే పెట్టుబ‌డిదారుల‌కు ఇదొక మంచి అవ‌కాశ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల స‌ల‌హాతో ఇందులో పెట్టుబ‌డి పెడితే లాభాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement