త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coal India Recruitment | కోల్ ఇండియాలో 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. మే 12 నుంచి ద‌ర‌ఖాస్తులు

Coal India Recruitment | కేంద్ర‌ప్ర‌భుత్వ ఆధీనంలోని మ‌హారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల‌ను భ‌ర్తీ (Coal India Recruitment) చేస్తున్న‌ది.

G

National | Published On May 6, 2026, 12.33 pm IST

Coal India Recruitment | కోల్ ఇండియాలో 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. మే 12 నుంచి ద‌ర‌ఖాస్తులు
Advertisement

Coal India Recruitment | కేంద్ర‌ప్ర‌భుత్వ ఆధీనంలోని మ‌హారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల‌ను భ‌ర్తీ (Coal India Recruitment) చేస్తున్న‌ది. 660 ఎంటీ ఈ-1 గ్రేడ్ ఉద్యోగ నియామ‌కాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త క‌లిగిన‌వారు www.coalindia.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జూన్ 11 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.60 వేల నుంచి రూ.1,80,000 వ‌ర‌కు అందుకోచ్చు.

మొత్తం పోస్టులు: 660
ఇందులో సివిల్ 178, ఎల‌క్ట్రిక‌ల్ 221, మెకానిక‌ల్ 145, సిస్ట‌మ్ (ఐటీ లేదా సీఎస్‌) 43, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ 38, జియాల‌జీ 15, ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ 15, రాజ్‌భాషా హిందీ 05, కంప‌నీ సెక్రెట‌రీ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌
ఇంజినీరింగ్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. ఏప్రిల్ 30 నాటికి 30 ఏండ్ల‌లోపువారై వ‌య‌స్సు క‌లిగి ఉండాలి.

ఎంపిక విధానం
కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ద్వారా. ప‌రీక్ష 2 పేప‌ర్లు ఉంటుంది. 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. త‌ప్పు స‌మాధానాల‌కు నెగెటివ్ మార్కులు లేవు.

  • పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, రీజ‌నింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు.
  • పేప‌ర్‌-2లో ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్‌ను ప‌రీక్షిస్తారు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్లూడీ అభ్య‌ర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: మే 12
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 11
వెబ్‌సైట్‌: https://www.coalindia.in

Advertisement
Advertisement